స్కూల్ డైరెక్టర్‌ను కొట్టిన విద్యార్థిని తల్లి, వీడియో హల్‌చల్
జలంధర్: ఓ విద్యార్థిని తల్లి పాఠశాల డైరెక్టర్‌ను కొట్టినట్లుగా ఉన్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో జలంధర్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీ నుండి తీసుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగినట్లుగా ఉంది.
అందులో ఉన్న మహిళల్లో ఒకరు ఓ విద్యార్థి తల్లి. మరొకరు సదరు ప్రయివేటు పాఠశాల డైరెక్టర్. వీడియోలో... వారిద్దరు కూడా ఒకరిని మరొకరు తోసుకుంటున్నట్లుగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు, తన కూతురు పాఠశాల పరిసరాల్లో మొబైల్ ఫోన్ వాడటాన్ని స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. అంతేకాదు, ఏప్రిల్ 20వ తేదీన తన కూతురు మొబైల్ ఫోన్‌ను పాఠశాల డైరెక్టర్ జ్యోతి నాగ్రాణి సీజ్ చేశారు. ఆ విద్యార్థిని ఫోన్‌తో పాటు పాఠశాలకు ఫోన్ తీసుకు వచ్చన మరో ముగ్గురు ఫోన్లు కూడా సీజ్ చేశారు.

తన కూతురు మొబైల్ ఫోన్‌ను సీజ్ చేయడంతో ఆ తల్లికి కోపమొచ్చింది. వెంటనే ఆమె పాఠశాల లోపలకు వెళ్లి, ఓ గదిలోకి వెళ్లి డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఇరువురు తోసుకున్నారు. ఇది సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications