Viral video: గజరాజుల గుంపును చూసి వణికిన పులి: పొదల్లో నక్కుతూ దారిచ్చింది

న్యూఢిల్లీ: పులి ఎదురుపడితే ఎలాంటి జంతువైనా భయంతో పరుగులు పెట్టాల్సిందే. పులి వస్తుందంటే.. అక్కడ్నుంచి అన్ని జంతువులు పారిపోతాయి. కానీ, ఓ గజరాజుల(ఏనుగుల) గుంపును చూసి పులి జడసుకుంది. అంతేగాక, ఆ ఏనుగుల గుంపు వెళ్లిపోయే వరకు కూడా ఓ చిన్నపొదలో దాక్కుండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోను మొదట వైల్డ్ లైఫ్ ఫొటో‌గ్రాఫర్ విజేత సింహ రికార్డు చేశారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను సుశాంత నందా ట్వీట్ చేశారు. అడవిలో స్వేచ్ఛగా విహరించే పులి ఏనుగుల గుంపు వెళ్లేందుకు తాను గడ్డిలో దాక్కుని ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు. జంతువుల మధ్య ఉండే సామరస్య గుణాన్ని ఈ దృశ్యం వెల్లడిస్తుందని సుశాంత నందా వ్యాఖ్యానించారు.

Viral video: Tiger gives way to herd elephants

జంతువులు ఈ విధంగా క‌మ్యూనికేట్ చేసుకుంటూ సామ‌ర‌స్యంగా మెలుగుతాయి. పులి వాస‌న‌ను ప‌సి గ‌ట్టిన ఏనుగు శ‌బ్ధం చేస్తే అడ‌వికి రాజు ఆపై గ‌జ‌రాజుకి దారి ఇచ్చాడ‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. కాగా, ఏనుగులు వెళ్లి పోవడంతో పులి నెమ్మదిగా లేచి ఆ ఏనుగులు వెళ్తున్న దారివైపు కొంతదూరం వెళ్లి మళ్లీ వెనక్కి తన దారిన వెళ్లేందుకు యత్నించింది. అయితే, సరిగ్గా అప్పుడే ఇంకో ఏనుగు దానికి ఎదురుపడుతుంది. ఒక్కసారిగా భయపడిపోయిన పులి.. దానికి కూడా దారిచ్చి అక్కడ్నుంచి వేగంగా జారుకుంటుంది.

కాగా, ఈ వీడియో పోస్ట్‌ను ఇప్ప‌టివ‌ర‌కూ 87,000కుపైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు, వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పులి స‌మ‌య‌స్ఫూర్తిని ప‌లువురు ప్ర‌శంసించారు. పెద్ద జంతువును ఎదుర్కోవ‌డం అసాధ్య‌మ‌ని గ్ర‌హించిన పులి తెలివిగా దూరం పాటించింద‌ని కొందరు యూజ‌ర్లు కామెంట్ చేశారు. ఏనుగుల గుంపును చూసి పులి వణికిపోయిందని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అనవసరమైన గొడవ ఎందుకు అని పులి భావించి ఇలా చేసిందేమోనని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+