తమిళ నటుడి ఆత్మహత్యాయత్నం: ఆదుకున్న హీరో విశాల్

చెన్నై: ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన తమిళ నటుడు ఇళవరసన్ అలియాస్ అరసును హీరో విశాల్ ఆదుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇలవరసన్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. సిరుతయి, సగుని తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన ఇళవరసన్‌ వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఇలవరసన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తమిళ హీరో విశాల్‌ తన దేవీ సంక్షేమ సంఘం నుంచి కొంతమంది వ్యక్తులను ఇళవరసన్‌ దగ్గరకు పంపి ఆసుపత్రి ఖర్చులకు రూ. 10,000 అందించారని తెలుస్తోంది.

Vishal helps tamil film actor Ilavarasan

ఇళవరసన్‌ సమస్యలు తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తానని విశాల్‌ మాటిచ్చినట్లు తెలుస్తోంది. చెన్నై వరదల సమయంలో స్వయంగా వెళ్లి బాధితులకు విశాల్ సహాయం అందించారు. 29 ఏళ్ల ఇళవరసన్ చెన్నైలో విషం సేవించి ఆత్మహత్యానికి ప్రయత్నించాడు.

విశాల్‌ను ఉద్దేశించి ఇళవరసన్ సూసైడ్ నోట్ రాశారు. తనకు చాలా మంది నిర్మాతలు డబ్బులు ఇవ్వాల్సి ఉందని, ఆ డబ్బులు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని అతను ఆ సూసైడ్ నోట్‌లో రాశాడు. విశాల్ దక్షిణ భారత ఆర్టిస్టుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.

విశాల్‌ను కలవడానికి చాలా ప్రయత్నాలు చేశానని, కాని ఫలించలేదని ఇళవరసన్ నోట్‌లో రాశాడు. ఇళవరసన్ బార్య శశికళ, కుమారుడు శివలతో కలిసి చెన్నైలోని ఎంకెబి నగర్‌లో నివాసం ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+