అమెరికా దర్శకుడి చిత్రం: మోడీగా వివేక్ ఒబరాయ్?
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జీవిత కథ నేపథ్యంగా అమెరికాకు చెందిన ఓ దర్శకుడు సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నరేంద్ర మోడీగా వివేక్ ఒబెరాయ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన దర్శకుడు తనను ఆ పాత్ర పోషించాలని అడిగినట్లు వివేక్ ఒబెరాయ్ చెప్పారు.
అన్నీ కుదిరి, సెట్స్‌కు వెళ్తే వివేక్ ఒబెరాయ్ నరేంద్ర మోడీ పాత్రలో జీవించనున్నారు. గుజరాత్ రోడ్డు రవాణా సంస్థలోని క్యాంటిన్‌లో పనిచేసిన ఉద్యోగిగా, టీ స్టాల్ నడిపించే చిరు యజమానిగా వివేక్ ఒబెరాయ్ నటిస్తారని అంటున్నారు.

సోమవారం జరిగిన షిల్లాంగ్‌లో జరిగిన యువజన సమావేశంలో ఆ వార్తపై వివేక్ ఒబెరాయ్ సానుకూలంగా స్పందించారు. నరేంద్రమోడీగా నటించాలని దర్శకనిర్మాతలను తనను అడిగారని ఓ ప్రశ్నకు సమాధానంగా వివేక్ చెప్పారు నరేంద్ర మోడీపై నిర్మించే చిత్రానికి మితేష్ పటేల్ దర్శకత్వం వహిస్తారని వివేక్ తెలిపారు.
నరేంద్ర మోడీ పాత్రలో నటించే విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివేక్ ఒబెరాయ్ చెప్పారు. ఆయన రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్ర పోషించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications