బంపర్‌ఆఫర్: రూ.22,999లకే వీవో వీ 5ప్లస్, రూ. 5 వేల తగ్గింపు
వివో వీ5 ప్లస్ ఫోన్ ధరను రూ. 5 వేలు తగ్గిస్తూ వివో కంపెనీ నిర్ణయం తీసుకొంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
న్యూఢిల్లీ: వివో వీ5 ప్లస్ ఫోన్ ధరను రూ. 5 వేలు తగ్గిస్తూ వివో కంపెనీ నిర్ణయం తీసుకొంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో ఈ ఫోన్ ధర సుమారు 27,980. కాగా, ఐదు వేలను ఈ ఫోన్‌పై తగ్గించడంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.22,999కు చేరింది.
ఈ ఫోన్‌ను ఆరు మాసాల క్రితం వివో కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌పై వివో కంపెనీ రూ.5వేలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది.అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమల్లో ఉంటుందనే విషయాన్ని మాత్రం ఆ కంపెనీ ప్రకటించలేదు.

వివో వీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో స్పెషల్ వేరియంట్‌ను కూడ ఐపీఎల్ సందర్భంగా లాంచ్ చేసింది. ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని యాప్ప్‌తో ఆ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
సెల్పీ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. రెండు సెల్పీ కెమెరాలను కలిగి ఉండడం దీని ప్రత్యేకత ఒకటి 20 మెగాపిక్సెల్, మరోటి 8 మెగాపిక్సెల్, అంతేకాదు వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌తో మరో కెమెరా ఉంది. 5.5 అంగుళాల పుల్ హెచ్‌డీ డీస్‌ప్లే ఐదవ జనరేషన్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాసెస్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3055 ఎంఎహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ 4జీ ర్యామ్ 64 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీ , ఆండ్రాయిడ్ 6.0 ఆధారిత ఫన్‌టచ్ ఓస్ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.












Click it and Unblock the Notifications