వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ బినామి కంపెనీలపై కేంద్రం నిఘా: వ్యాపార రంగానికి దూరం చెయ్యాలని ప్లాన్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి చివరికి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు మళ్లీ సినిమా కష్టాలు మొదలైనాయి.

దినకరన్ తిక్క చేష్టలతోనే ఇంత జరిగింది: మన్నార్ గుడి మాఫియాకు శశికళ ఫుల్ క్లాస్!దినకరన్ తిక్క చేష్టలతోనే ఇంత జరిగింది: మన్నార్ గుడి మాఫియాకు శశికళ ఫుల్ క్లాస్!

అనేక బినామీ కంపెనీల్లో భాగస్వామ్యం ఉన్న శశికళను త్వరలో బ్లాక్ లిస్ట్ లోకి చేర్చే అవకాశం ఉందని వెలుగు చూసింది. బినామీ కంపెనీల్లో భాగస్వామ్యం ఉన్న అనేక మంది ప్రముఖుల పేర్లను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. దేశ వ్యాప్తంగా అనేక మంది బినామీ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు.

VK Sasikala list disqualified shell firm directors

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అధికారంలో ఉన్న సమయంలో ఆమెను అడ్డం పెట్టుకుని శశికళ అనేక అక్రమాస్తులు సంపాధించారని, అనేక బినామీ కంపెనీల్లో భాగస్వామ్యం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బినామీ కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.

తమిళనాడు సీఎం గ్రూప్ లో స్లీపర్ సెల్స్ స్లీపింగ్: దినకరన్ ను నమ్ముకుంటే పదవి, పరువు!తమిళనాడు సీఎం గ్రూప్ లో స్లీపర్ సెల్స్ స్లీపింగ్: దినకరన్ ను నమ్ముకుంటే పదవి, పరువు!

బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాధిస్తున్న సీఈవోలు, డైరెక్టర్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఆ జాబితాలో శశికళ పేరు ఉందని సమాచారం. శశికళ బినామి కంపెనీలు గుర్తించి ఆమెను వ్యాపార రంగంలో అనర్హురాలిని చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావించిందని తెలిసింది.

శశికళకు మద్యం వ్యాపారం కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్ కు చెందిన జాజ్ సినిమాస్ సైతం శశికళ బినామీ సంస్థ అని ప్రచారంలో ఉంది. ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉందని సమాచారం.కేరళ మాజీ ముఖ్య మంత్రి ఉమెన్ చాందీ సైతం బినామీ కంపెనీల జాబితాలో ఉండటం కొసమెరుపు.

English summary
V.K. Sasikala, in the Centre’s list of disqualified directors of shell companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X