భర్త దగ్గర కొంత సేపు, చక్రం తిప్పుతున్న చిన్నమ్మ శశికళ, నిఘా వేసిన ఇంటలిజెన్స్ వర్గాలు!

Recommended Video

    Sasikala Visited Her Husband Natarajan At A Private Hospital చక్రం తిప్పుతున్నశశికళ| Oneindia Telugu

    చెన్నై: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ ను చూడటానికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

    ఆసుపత్రిలో కేవలం కొంత సమయం కేటాయిస్తున్న శశికళ తరువాత చెన్నైలోని టీ నగర్ లోని తన మేనకోడులు క్రిష్ణ ప్రియ ఇంటి నుంచి చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు ఎంపీలు, అనర్హత వేటుకు గురైన ఓ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో శశికళ భేటీ అయ్యారని వెలుగు చూసింది.

    భర్తను చూసిన శశికళ

    భర్తను చూసిన శశికళ

    ఆదివారం చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ ను పరామర్శించడానికి శశికళ వెళ్లారు. శశికళ వెంట ఆమె మేనల్లుడు జయ్ఆనంద్ కూడా వెళ్లారు. ఆసుపత్రిలో భర్త నటరాజన్ ను చూసిన వెంటనే శశికళ బోరున విలపించారని సమాచారం.

    భర్త దగ్గర 15 నిమిషాలు మాత్రమే!

    భర్త దగ్గర 15 నిమిషాలు మాత్రమే!

    తన భర్త నటరాజన్ ను మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారని సమాచారం. శశికళను మాత్రమే ఐసీయూలో చికిత్స పొందుతున్న నటరాజన్ ను చూడటానికి వైద్యులు అనుమతి ఇచ్చారు. 15 నిమిషాలు ఐసీయూలో భర్త దగ్గర ఉన్న శశికళ తరువాత విజిటర్స్ గదిలోకి వెళ్లారు.

    మేనకోడలు ఇంటిలో రాజకీయాలు

    మేనకోడలు ఇంటిలో రాజకీయాలు

    విజిటర్స్ గదిలో కొంత సమయం ఉన్న శశికళ తరువాత టీ నగర్ లోని మేనకోడలు క్రిష్ణ ప్రియ ఇంటికి వెళ్లిపోయారు. మేనకోడలు క్రిష్ణ ప్రియ ఇంటి నుంచే శశికళ చక్రం తిప్పుతున్నారు. చిన్నమ్మ శశికళను కలవడానికి వందల మంది టీ నగర్ లోని క్రిష్ణ ప్రియ ఇంటి దగ్గరకు క్యూ కడుతున్నారు.

    ఇక పెరోల్ కష్టమే

    ఇక పెరోల్ కష్టమే

    కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ఆదేశాల మేరకు శశికళ మూడు వాహనాలు వెంట తీసుకుని బయటకు బయలుదేరాలి.శశికళ నియమాలు ఉల్లంఘించి ఏడు వాహనాల కాన్వాయ్ తో బయటకు వెళ్లారని వెలుగు చూసింది. పెరోల్ నియమాలు ఉల్లంఘిస్తున్న శశికళకు ఇక ముందు మరో సారి పెరోల్ చిక్కే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.

    ఇంటలిజెన్స్ నిఘా

    ఇంటలిజెన్స్ నిఘా

    శశికళ భర్త నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి దగ్గర, ఆమె మేనకోడులు క్రిష్ణ ప్రియ నివాసం ఉంటున్న టీ నగర్ లోని హబీబుల్లా రోడ్డులని ఇంటి దగ్గర ఇంటలిజెన్స్ వర్గాలు మఫ్టీలో నిఘా వేశారు. శశికళను కలవడానికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు అంటూ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+