వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ సంతోషంతో బిగ్గరగా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ తమిళనాడులో తాను సూచించిన ఎడప్పాడి పళనిసామి బలపరిక్షలో విజయం సాధించారని తెలుసుకున్న తరువాత ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని తెలిసింది.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని మహిళా ఖైదీలు ఉంటున్న మొదటి అంతస్తులో ఉన్న శశికళ శనివారం ఉదయం టిఫిన్ చేసిన తరువాత సమీపంలోని ఖైదీలు అందరి కోసం ఏర్పాటు చేసిన టీవీ దగ్గర కదలకుండా కుర్చుండిపోయారని సమాచారం.

శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?

మద్యాహ్నం భోజనం చెయ్యడానికి కూడా ఆమె వెళ్లలేదని తెలిసింది. తమిళనాడు సచివాలయంలో ఏంజరుగుతుందో అంటూ టీవీలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారని, ఎడప్పాడి పళనిసామి బలపరీక్షలో విజయం సాధించిన తరువాత శశికళ అక్కడి నుంచి కదిలారని అక్కడ పని చేస్తున్న ఓ అధికారి అన్నారు.

Vk Sasikala Natarajan may have played a masterstroke, getting her nominee in the chief minister's chair through the backdoor before stepping into prison in Karnataka.

ఎడప్పాడి పళనిసామి తమిళనాడు సీఎంగా తన బలపరీక్షలో విజయం సాధించారని స్పీకర్ ప్రకటించిన వెంటనే శశికళ బిగ్గరగా నవ్వేసి అక్కడి నుంచి తన సెల్ వైపు మౌనంగా వెళ్లిపోయారని ఆ అధికారి ఓ కన్నడ దినపత్రికకు చెప్పారు.

తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? రగులుతున్న రాష్ట్రంతమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? రగులుతున్న రాష్ట్రం

శనివారం ముగ్గురు న్యాయవాదులు శశికళతో మాట్లాడారు. తమిళనాడులో తాను సూచించిన వ్యక్తి సీఎంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం, బలపరిక్షలో విజయం సాధించడంతో ఆమె ఇక తమిళనాడు జైలుకు మకాం మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే ఆమెకు పరప్పన అగ్రహార జైల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, తమిళనాడుకు తరలించాల్సిన అవసరం లేదని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానంలో అభ్యంతరం వ్యక్తం చేస్తే శశికళ బెంగళూరు జైల్లోనే సామాన్య ఖైదీగా శిక్షఅనుభవించాల్సి ఉంటుంది.

English summary
Vk Sasikala Natarajan may have played a masterstroke, getting her nominee in the chief minister's chair through the backdoor before stepping into prison in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X