శశికళ WWE,జైల్లో ఫోటోలు వైరల్: సోషల్ మీడియాలో దేశంలోనే టాప్
బెంళూరు/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన శశికళ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
శశికళ చివరికి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారని, ఆమె చేరవలసిన చోటుకు చేరారని సోషల్ మీడియాలో జోకులుపేల్చుతున్నారు. ఇకనైన మా జీవితాలతో చెలగాటం ఆడాలనే ఆలోచన రాకూడదని, అలాంటి ప్రయత్నాలు చెయ్యరాదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ సలహాలు ఇస్తున్నారు.
புரியும் தமிழில் பிழையின்றி
— Kamal Haasan (@ikamalhaasan) February 15, 2017
శశికళ రెజ్లీంగ్ (WWE)ఆడితే ఇలా ఉంటుందని ఓ ఫోటో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫోటో దర్శనం ఇస్తున్నది. ఈ ఫోటో చూసిన చాలమంది శశికళ మీద జోకులు వేస్తూ ఆమె వర్గీయుల మీద కామెంట్లు చేస్తున్నారు.
யப்பா டேய் முடியல😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 pic.twitter.com/LYi7Q9Tx8d
— Actress Memes Mania (@AMMoffcl) February 15, 2017
బుధవారం సాయంత్రం పరప్పన అగ్రహార జైలుకు శశికళ వెళ్లిన విషయం తెలిసిందే. తమిళ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనుకున్న శశికళ చివరికి కర్ణాటకలో తల దించుకుని జైలు గదులు ఇాలా శుభ్రం చేస్తున్నారని ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
😂😂😂👌 pic.twitter.com/kT89S0q9Vu
— Troll Masters (@TMOffl) February 15, 2017
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు పెట్టారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో శశికళ వర్గీయులతో ఆడుకుంటున్నారు. ఇక తమిళనాడులో సరేసరి. ప్రస్తుతం దేశంలోనే సోషల్ మీడియాలో శశికళ హాట్ టాఫిక్ కావడంతో అనేక మంది ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications