చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ కు సీరియస్: గ్లోబల్ ఆసుపత్రిలో, కన్నెత్తి చూడలేదు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించి చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో ఆసుపత్రిపాలైనారు. నటరాజన్ ఆసుపత్రిలో చేరిన వెంటనే మన్నార్ గుడి మాఫియా ఆందోళనపడుతోంది.

నటరాజన్ అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మాన్నార్ గుడి మాఫియా సభ్యులు గ్లోబల్ ఆసుపత్రికి పరుగు తీశారు. నటరాజన్ ఆసుపత్రిలో చేరినా టీటీవీ దినకరన్ అటు వైపు కన్నెత్తి చూడలేదు.

VK Sasikalas husband Natarajan hospitalized in Chennai

తన భర్త తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకున్న శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కుమిలిపోతున్నారని సమాచారం. తన భర్తకు అవసరమైన సౌకర్యాలు చూడాలని శశికళ టీటీవీ దినకరన్ కు సూచించారని సమాచారం.

నటరాజన్ ఆసుపత్రిలో చేరినా టీటీవీ దినకరన్ అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని శశికళ అనుచరులు మండిపడుతున్నారు. శశికళ సోదరుడు దివాకరన్, ఆయన కుమారుడు జయంత్ గ్లోబల్ ఆసుపత్రి చేరుకుని నటరాజన్ ను పరామర్శించారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK Chief VK Sasikala's husband M Natarajan was hospitalised at Global hospitalin Chennai

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X