వొడాఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా 27 జీబీ 4జీ డేటా

వొడాఫోన్ పోస్టు పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్. 4జీ స్మార్ట్ ఫోన్ ఉన్న వారు ఒక్కో నెల 9 జీబీ చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా 4జీ డేటా వినియోగించుకోవచ్చు.

ముంబై: వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో నెల 9 జీబీ చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా 4జీ డేటా అందించనున్నట్టు పేర్కొంది. మొత్తంగా 27 జీబీ 4జీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది.

తన యూజర్లు రిలయన్స్ జియో నెట్ వర్క్ కు తరలిపోకుండా ఉండేందుకే వొడాఫోన్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే జియో తన కస్టమర్ల కోసం 'ధన్ ధనా ధన్' పేరిట ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ఆఫర్ కు పోటీగా ఇతర టెలికాం కంపెనీలు సైతం పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ టెల్ కూడా తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 30 జీబీ ఉచిత డేటా ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Vodafone Giving Postpaid Users Free 27GB 4G Data for 3 Months

ఇప్పుడు వొడాఫోన్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ జూలై మధ్య వరకు అందుబాటులో ఉంటుంది. వొడాఫోన్ కొత్త ఆఫర్ కింద 9 జీబీ ఉచిత డేటాను పోస్టు పెయిడ్ కస్టమర్లు వినియోగించుకోవచ్చని, ఇది ఇప్పటికే ఉన్న తన ప్లాన్స్ లో భాగమని తెలిసింది.

ఇప్పటికే వొడాఫోన్ రెడ్ యూజర్లకున్న రూ.499 ప్లాన్ కింద నెలకు 3GB + 9GB డేటాను మూడు నెలలపాటు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా రూ.699 వొడాఫోన్ రెడ్ ప్లాన్ పై 5GB + 9GB డేటాను నెల పాటు పొందవచ్చు.

ఈ డేటా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలంటే పోస్టు పెయిడ్ కస్టమర్లు వొడాఫోన్ వెబ్ సైట్లోకి వెళ్లి, తమ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చిన ఓటీపీ నెంబర్ ని వెబ్ సైట్ లో ఎంటర్ చేసి ఉచిత డేటాను పొందవలసి ఉంటుంది.

అంతేకాదు, దీనికోసం వొడాఫోన్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి. కంపెనీ ఇటీవలే 352 రూపాయలతో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటాను ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా వొడాఫోన్ కంపెనీ కల్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+