జియోకు కౌంటర్: వొడాఫోన్ బంపర్ ఆఫర్.. రూ.19కే 'అన్ లిమిటెడ్' ప్యాకేజీ
రూ.19ధరతో అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, 100ఎంబీ 4జీ డేటాను అందిస్తూ సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమేనని వొడాఫోన్ షరతు విధించింది.
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్ని కుదేలైపోయాయి. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్ ఆఫర్ తో కస్టమర్లంతా జియో వైపు క్యూ కట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన టెలికాం కంపెనీలు అనివార్యంగా ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వొడాఫోన్ కంపెనీ ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.19ధరతో అన్ లిమిటెడ్ ఫ్రీ లోకల్/ఎస్టీడీ కాల్స్, 100ఎంబీ 4జీ డేటాను అందిస్తూ సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమేనని వొడాఫోన్ షరతు విధించింది.

ఈ ఆఫర్‌తో పాటు సూపర్ వీక్ పేరుతో మరో ఆఫర్ ను కూడా తీసుకొచ్చింది. దీని ప్రకారం రూ. 49తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 250ఎంబీ 4జీ డేటాను ఇస్తున్నట్లు వొడాఫోన్ తెలిపింది. కాగా, జియోలోను రూ.19 ప్రారంభ ధరతో ఇదే డేటా ఆఫర్ ఉన్న సంగతి తెలిసిందే. జియోతో పోటీని తట్టుకుని నిలబడేందుకే వొడాఫోన్ ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications