ఎన్నికల కోడ్ వర్తిస్తుందే బాలా..! వెడ్డింగ్ కార్డులో మోడీ ప్రస్తావనకు నోటీసులు
డెహ్రాడూన్ : పెళ్లిళ్లకు, ఎన్నికల కోడ్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? అవును సంబంధముంది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి కొడుకు తండ్రికి ఎన్నికల సంఘం తాఖీదులు జారీచేసింది. ప్రధాని మోడీపై చూపిన అభిమానం ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది.
జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తి తన కుమారుడికి పెళ్లి నిశ్చయించారు. అయితే వెడ్డింగ్ కార్డుల్లో పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు మోడీకి ఓటు వేయండనే అంశం ముద్రించడం వివాదస్పదమైంది. కట్నకానుకలు తీసుకురావొద్దని.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలని ప్రింట్ వేయించారు. అదే తమకు పెద్ద బహుమానమని పేర్కొన్నారు.

మోడీపై ఉన్న అభిమానంతో చంద్ర జోషి ఆ పని చేసినా.. ఎన్నికల సంఘం అధికారుల కనుసన్నల్లోంచి తప్పించుకోలేకపోయారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశం కూడా ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయనకు నోటీసులు జారీచేశారు. వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన చంద్ర జోషి.. తెలియకుండా తప్పు జరిగిందని, క్షమించమని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏ పార్టీకి తాము మద్దతివ్వడం లేదని, ఎందులోనూ క్రీయాశీలకంగా పనిచేయడం లేదంటున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications