బార్ గర్ల్ వల్గర్ డ్యాన్స్, డబ్బు వెదజల్లారు (వీడియో)
పాట్నా: 'బీహార్ దివస్' రోజు ఓ బార్ గర్ల్ అసభ్యకరంగా డ్యాన్స్ చేసింది. ఆమె పైన పలువురు కౌన్సెలర్లు నోట్లు వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

బీహార్ దివస్ నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బార్ గర్ల్ అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైంది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని సీతామర్తి జిల్లాలో జరిగింది.
బీహార్ దివస్ సందర్భంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో సదరు బార్ గర్ల్ వల్గర్‌గా డ్యాన్స్ చేసింది. జిల్లాకు చెందిన పలువురు కౌన్సెలర్లు ఆ బార్ గర్ల్ పైన డబ్బులు వెదజల్లుతున్నట్లు వీడియోలో ఉంది.












Click it and Unblock the Notifications