షాకింగ్: కోహ్లీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?, 9వ తరగతి ప్రశ్నాపత్రంలో ప్రశ్న
ముంబై: మహారాష్ట్రలో తొమ్మిదో తరగతి పరీక్షల్లో షాకింగ్ ప్రశ్న ఇచ్చారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, దానికి మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మొదటి ఆప్షన్ ప్రియాంక చోప్రా, రెండో ఆప్షన్ అనుష్క శర్మ, మూడో ఆప్షన్ దీపికా పదుకొణే, నాలుగో ఆప్షన్ తెలియదు అని ఇచ్చారు.
మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పరీక్షలో అడిగిన ప్రశ్న హల్‌చల్ చేస్తోంది. భివాండిలోని చాచా నెహ్రూ హిందీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థుల ఫిజికల్ ట్రైనింగ్ పరీక్షలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్న అడిగారు. కోహ్లీ గర్ల్‌ఫ్రెండ్ పేరు ఏమిటని అందులో ఉంది.

ఈ ప్రశ్నాపత్రాన్ని స్థానిక మీడియా ఛానల్ ఒకటి ప్రసారం చేసింది. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.
ఆ మధ్య వీరిద్దరూ కొన్ని రోజులు విడిపోగా, ఇటీవల మళ్లీ కలుసుకున్నారు. గత నెలలో జరిగిన భారత ఎయిర్‌ఫోర్స్ ఇంజినీరింగ్ పరీక్షల్లో దీపికా పదుకొణె పీకూ చిత్రం, ఆ మధ్య తమిళనాడులోని ఓ కాలేజీలో జరిగిన సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో బాహుబలి చిత్రానికి సంబంధించిన ప్రశ్నలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications