నేనిచ్చిన కారు, డబ్బు తిరిగిచ్చేయండి: కేజ్రీవాల్‌కు ఆప్ వీరాభిమాని (ఫోటో)
న్యూఢిల్లీ: గత ఏడాది ఢిల్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తిరిగిన బ్లూ కలర్ వాగన్ ఆర్ కారును బ్రిటన్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వీరాభిమాని కుందన్ శర్మ బహుమతిగా ఇచ్చారు.
అయితే ఇప్పుడు తాను బహుమతిగా ఇచ్చిన కారును, ఆమ్ ఆద్మీ పార్టీకి తనతోపాటు తన భార్య డొనేట్ చేసిన నగదును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్‌లో పలు ట్వీట్స్ చేశాడు. సడన్‌గా కుందన్ శర్మ ఇలా మారడానికి గల కారణాలను కూడా తెలియజేశాడు.
#IDemandMyDonationBackFromAAP: My blue WAGONR,my Bike&lacs of rupees that I donated2AAP http://t.co/XT2UYLkGlX @shashiranjanttv @ravishndtv
— Kundan Sharma (@kundan_scorpio) April 4, 2015 ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్‌ల మధ్య జరిగిన గొడవలు ఆయన్ని మనస్తపానికి గురి చేసినట్లు ట్వీట్ చేశారు. అంతే కాదు, ఆ కారు తన భార్య శారదా పేరిట రిజస్టర్ అయిందని, నిర్భయ ఘటనపై పార్టీ స్పందన చూసిన తర్వాత కారును డోనేట్ చేశానని తెలిపాడు.
I will b happy if AAP can giv right2get refund of donation instead of right2recall balyan types MLA. Latter looks impossible. So do easy 1.
— Kundan Sharma (@kundan_scorpio) April 2, 2015 జనవరి 1, 2013న కేజ్రీవాల్ తనతో స్వయంగా మాట్లాడారని, 3వ తేదీన కారు ఇచ్చానని, తనని అభినందిస్తూ, పార్టీ లెటర్ హెడ్‌పై ఒక లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇన్నోవా వాహనంలో పర్యటనలు మొదలుపెట్టేదాకా ఈ వాగన్ ఆర్ కారులో తిరిగారు.
I was die hard fan of AK when I saw AAP from 10000ft & lost hope when I saw it from 10ft. All that glitter is not gold.
— Kundan Sharma (@kundan_scorpio) April 3, 2015 
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఈ బ్లూ వాగన్ ఆర్ కారుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఢిల్లీ నగరంలో నడిబొడ్డున ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేపట్టిన సమయంలో ఈ కారులోనే ఆయన నిద్రించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications