సైనికుడ్ని కావాలనుకుని క్రికెటరయ్యా: ఎంఎస్ ధోనీ

రాంచీలోని పారాచూట్ రెజిమెంట్‌లో ఓ రోజు గడుపుతూ ఆయన ఆజ్ తక్‌తో మాట్లాడాడు. యూనిఫాం తన ఎత్తు భయాన్ని తొలగించిందని చెప్పాడు. యూనిఫాం ప్రత్యేకమైందని, బహుశా ఈ యూనిఫాంకే తాను భయపడలేదని అన్నాడు.
సైనికాధికారులతో ధోనీ సరదాగా గడిపాడు. ఒత్తిడిలో కూడా కూల్‌గా ఉండడం ఎలా సాధ్యమవుతోందని వారు ఆయనను అడిగారు. మీడియా సమావేశానికి ముందు రోజు తాను వెళ్లి ఫ్రిడ్జ్‌లో కూర్చుంటానిని, ఆ రకంగా తాను కూల్‌గా ఉంటానని ధోనీ హాస్యమాడాడు.
ధోనీ జవాన్లతో సరదాగా గడపడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కలిశాడు. వారితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. వారి పిల్లలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.












Click it and Unblock the Notifications