వక్ఫ్ చట్టం చిచ్చు: మంటలు రేపుతున్న ప్రతిపక్షాలు - అసలు కథేంటి?

దేశంలో ఇప్పుడు వక్ఫ్ చట్టం హాట్ టాపిక్! కొత్త చట్టం వచ్చిందో లేదో నిరసనలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు.. ఇలా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఎం, ఆర్జేడీ, జేఎంఎం, ఆప్.. ఇలా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసికట్టుగా ఉద్యమానికి ఊపునిస్తున్నాయి. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని మోదీ సర్కార్ తెగేసి చెబుతోంది - వక్ఫ్ సవరణ చట్టం 2025 వెనుక కుట్రలేమీ లేవు. ఇది అవినీతిని, అక్రమాలను కట్టడి చేసేందుకే తెచ్చిన సంస్కరణ అంటోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేస్తోంది. ఈ చట్టం ఏ ఒక్క మతానికో, వర్గానికో వ్యతిరేకం కాదని, ఇది అందరికీ న్యాయం చేస్తుందని భరోసా ఇస్తోంది. వక్ఫ్ ఆస్తుల్ని కాపాడి, వాటిని సక్రమంగా ఉపయోగించేందుకే ఈ చట్టం అని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది.

waqf-act-firestorm-protests-politics-and-the-real-story-behind-modis-reform

వక్ఫ్ అంటే ఏంటి? ఎందుకీ గొడవ?
ముస్లింలు మతపరమైన, ధార్మిక కార్యకలాపాల కోసం ఇచ్చిన ఆస్తులనే వక్ఫ్ అంటారు. ఇన్నాళ్లూ ఈ ఆస్తుల నిర్వహణలో లెక్కా పత్రం లేదు. పర్యవేక్షణ కరువైపోయింది. దీంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, అక్రమాలు పెరిగిపోయాయి. ఇప్పుడీ బీజేపీ సర్కార్ రంగంలోకి దిగింది. పాత చట్టాలకు స్వస్తి చెప్పి కొత్త సంస్కరణలు తెచ్చింది. వక్ఫ్ బోర్డుల పెత్తందారీకి కళ్లెం వేసింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించామని చెబుతోంది.ప్రతిపక్షాలు మాత్రం ఈ చట్టాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను భయపెడుతున్నాయని బీజేపీ మండిపడుతోంది. కానీ నిజం చెప్పాలంటే, ఈ చట్టం ఎంతో ముందుచూపుతో, అవసరమైన మార్పులతో వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటులో చర్చ జరిగాకే బిల్లు పాసైందని గుర్తు చేస్తున్నారు. ఇది రాజకీయ లబ్ధికోసం కాదు, ప్రజల కోసమేనని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

ఇన్నాళ్లూ గుత్తాధిపత్యం.. ఇకపై చెక్!
వక్ఫ్ బోర్డులు తమ ఇష్టానుసారం వ్యవహరించాయి. ఏ భూమినైనా వక్ఫ్ భూమిగా ప్రకటించేసే అధికారం వాటికి ఉండేది. సెక్షన్ 40 అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా రూల్ చేశాయి. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ సెక్షన్ 40ని రద్దు చేసింది! ఇకపై వక్ఫ్ బోర్డుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. మతం పేరుతో భూములు లాక్కోవడం చెల్లదని తేల్చి చెప్పింది.

జవాబుదారీతనం ముఖ్యం!
గతంలో వక్ఫ్ బోర్డులకు విపరీతమైన అధికారాలు ఉండేవి. వాటిని కొందరు ఇష్టానుసారంగా వాడుకున్నారు. అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. ప్రజలు విసిగిపోయారు. అందుకే సెక్షన్ 40ని రద్దు చేసి, వక్ఫ్ బోర్డుల పవర్స్‌ను తగ్గించింది ప్రభుత్వం. ఇప్పుడు అన్నీ పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం జరగాలి. ఎవరికీ ఇష్టమొచ్చినట్లు రూల్ చేసే వీల్లేదు.

waqf-act-firestorm-protests-politics-and-the-real-story-behind-modis-reform

ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి!
వక్ఫ్ ఆస్తుల లెక్కలు పత్రాలు ఇకపై ఆన్‌లైన్‌లో పెడతారు. డిజిటలైజేషన్ చేస్తారు. పేద ముస్లింలు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఈ ఆస్తుల ఫలాలు అందాలి. ముఖ్యంగా పస్మాండా ముస్లింలకు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. వంశపారంపర్యంగా వస్తున్న మత పెద్దలు, రాజకీయ నాయకుల చేతుల్లో అధికారం ఉండకూడదు. సామాన్యులకు కూడా లబ్ధి చేకూరాలనేది ఈ సంస్కరణల ఉద్దేశం.

కలిసికట్టుగా పాలన.. ఇదే అసలైన సంస్కరణ!
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు కూడా చోటు కల్పించింది ప్రభుత్వం. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లోనూ నాన్-ముస్లిం సభ్యులు ఉంటారు. ఇది ముస్లింల అధికారాన్ని తగ్గించడమేనని కొందరు విమర్శిస్తున్నారు. కానీ బీజేపీ వాదన మరోలా ఉంది. అందరినీ కలుపుకుని పోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామంటోంది. ముస్లింలలోనే చాలా చిన్న చిన్న వర్గాలు ఉన్నాయి. బోహ్రా, అఘాఖానీ ముస్లింలకు వక్ఫ్ బోర్డుల్లో చోటు దక్కేది కాదు.

ఇప్పుడు వాళ్ల గొంతు కూడా వినపడుతుంది. అంతేకాదు, మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. ఇది నిజంగా గొప్ప మార్పు అంటున్నారు బీజేపీ నేతలు.ఇతర మతాల వారిని కూడా పాలనలో భాగం చేయడం వల్ల మంచి పాలన అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విమర్శకులు దీన్ని వేరేలా చూడొచ్చు కానీ, నిజానికిది ఆధునిక పాలనా విధానం. ప్రపంచంలో చాలా దేశాలు ఇలాంటి పద్ధతులనే పాటిస్తున్నాయి. పారదర్శకత, అందరికీ ప్రాతినిధ్యం.. ఇవే ఇప్పుడు ముఖ్యం.

Take a Poll

భూమి మనది.. గౌరవం మనది!

ప్రభుత్వ భూములను వక్ఫ్ భూములని చెప్పి కాజేసిన రోజులు పోయాయి. ఇకపై ప్రభుత్వ భూమిని ఎవరూ టచ్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఆక్రమిస్తే ప్రభుత్వం వెంటనే వాటిని స్వాధీనం చేసుకుంటుంది. భూ వివాదాలు ఇకపై కోర్టుల్లో త్వరగా తేలుతాయి.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పనంగా ఇచ్చే పనులు జరగవు.గిరిజన భూములకు కూడా ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది. గిరిజనుల భూములపై వక్ఫ్ బోర్డులు కన్నేస్తే కుదరదు. వాళ్ల హక్కులను కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.

మతంపై దాడి కాదు.. సంస్కరణల పర్వం!
ఇది ముస్లిం వ్యతిరేక చట్టం కానే కాదు.ఇది న్యాయం కోసం,పారదర్శకత కోసం తెచ్చిన చట్టం.వక్ఫ్ సవరణ బిల్లు నిజంగానే ఒక మోడ్రన్ చట్టం.వక్ఫ్ ఆస్తుల రికార్డులన్నీ డిజిటల్ చేస్తారు.ఒక సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది.ఎప్పుడు కావాలన్నా ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు.ఆడిటింగ్ కూడా సులువు అవుతుంది.టెక్నాలజీని వాడటం ఈ రోజుల్లో అవసరం.ఇది లగ్జరీ కాదు, నిత్యావసరం.

టర్కీ, ఖతార్ లాంటి దేశాలు కూడా వక్ఫ్ వ్యవస్థను ఆధునీకరించాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత చట్టాలను కూడా మారుస్తున్నారు.స్థానిక సంప్రదాయాలకు గౌరవం ఇస్తూనే, అంతర్జాతీయ స్థాయిలో పాలన ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.వక్ఫ్ సవరణ బిల్లు 2025 అనేది వక్ఫ్ ఆస్తుల పాలనలో ఒక పెద్ద ముందడుగు. జవాబుదారీతనం, అందరికీ చోటు, ఆధునికత.. ఈ మూడింటి కలయికే ఈ చట్టం. "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" నినాదంతోనే బీజేపీ ఈ చట్టం తెచ్చిందని చెబుతోంది.

నిరసనలు, విమర్శలు ఎన్ని వచ్చినా, ఈ చట్టం మాత్రం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఇది ముస్లింలకే కాదు, దేశ ప్రజలందరికీ మేలు చేస్తుంది. ప్రపంచం మారుతోంది, మన పాలనా విధానాలు కూడా మారాలి. వక్ఫ్ సవరణ బిల్లు సరిగ్గా అదే పని చేస్తోంది. మోడ్రన్ పాలన, సమాన ప్రాతినిధ్యం.. ఈ రెండింటితో బీజేపీ ఒక న్యాయమైన, సమసమాజానికి బాటలు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+