మాటల యుద్ధం: లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌ బేడీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేదికపైనే గొడవపడ్డారు

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ,అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పుదుచ్చేరి రాష్ట్రంలో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగడంతో కేంద్రం అభినందిస్తూ పుదుచేరికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యక్రమం నిర్వహించింది. అయితే స్టేజ్‌పై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభకు హాజరైన మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ప్రజలు షాక్ అయ్యారు.

కార్యక్రమంలో భాగంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అనబలగన్ వేదికపై ప్రసంగించారు. సమయం మించిపోయినప్పటికీ ఆయన ప్రసంగం ఆపలేదు. అప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం మించిపోయిందని ఇక ప్రసంగాన్ని ఆపాల్సిందిగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ అనబలగన్ స్పీచ్ ఇవ్వడం ఆపేయలేదు. దీంతో స్వయంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రంగంలోకి దిగి మైక్ కట్ చేశారు. వేదిక దిగి వెళ్లాల్సిందిగా ఎమ్మెల్యేను ఆమె కోరారు. దీంతో మీరే ఇక్కడి నుంచి వెళ్లండి అంటూ అనబలగన్ గట్టిగా అరిచారు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. వీరి మధ్య చెలరేగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

War of words exchanged between Lieutenant Governor Kiran Bedi and an AIADMK lawmaker

సభ ముగిశాక కిరణ్ బేడీ ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన అనబలగన్ అనే ఎమ్మెల్యే గతంలో కూడా చాలా సార్లు ఇలా ప్రవర్తించాడని చెప్పింది. సమయం మించి ప్రసంగిస్తుంటే.. తన ప్రసంగం ముగించాల్సిందిగా పలువురు మంత్రులు కోరినప్పటికీ ఆయన మాట వినలేదని దీంతో మైక్ కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈయన ఇలా ప్రవర్తించడం గతంలో కూడా మరో వేదికపై చూసినట్లు కిరణ్ బేడీ గుర్తుచేశారు. ఇదిలా ఉంటే కిరణ్ బేడీ ఎమ్మెల్యే అనబలగన్‌ల మధ్య గొడవ జరుగుతుండగా మంత్రులు ఇతర ప్రతినిధులు వేదికపైనే ఉండి తమాషా చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+