Hijab: నీకు టైమ్ దగ్గర పడిపోయింది, ఎక్కువ రోజులు ?, లేపేస్తామ్, కాలేజ్ ప్రిన్సిపాల్ కు వార్నింగ్ !
బెంగళూరు/ మడికేరి: హిజాబ్ వివాదంపై విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయిలతో పాటు వారి కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు ఇప్పట్లో శాంతించడానికి అంగీకరించడం లేదని వెలుగు చూసింది. హిజాబ్ లు వేసుకుని రావడానికి అవకాశం లేదని కొన్ని కాలేజ్ లు, స్కూల్స్ యాజమాన్యం చెబుతోంది. ప్రభుత్వ స్కూల్స్ కాలేజ్ ల్లో మొదలైన హిజాబ్ వివాదం రెండుమూడు రోజుల్లో పెద్దదై కర్ణాటకతో పాటు దేశ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యింది. విద్యాసంస్థల్లో మొదలైన హిజాబ్ వివాదం రానురాను పెద్దదై రాజకీయ రంగు పులుముకుందని ఆరోపణలు ఉన్నాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ వేసుకునే విషయంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో అడుగుపెట్టిన విద్యార్థులను కాలేజ్ ప్రిన్సిపాల్ అడ్డుకున్నారు. ఈ సమయంలో కాలేజ్ గేట్ ముందు రచ్చరచ్చ అయ్యింది. కాలేజ్ ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసిన వ్యక్తి నువ్వు ఎక్కువ రోజులు బతకవని, నీకు టైమ్ దగ్గర పడిపోయిందని, నిన్ను త్వరలో లేపేస్తామని, నీ కథ క్లోజ్ అయిపోతుందని వార్నింగ్ ఇవ్వడం, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ నా ప్రాణాలు కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడంతో కలకలం రేపింది.

హిజాబ్ కచ్చితంగా కావాలి
కర్ణాటక వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. హిజాబ్ లేకుండా మేము క్లాస్ రూమ్ లో అడుగు పెట్టమని కొందరు ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. హిజాబ్ వివాదంపై విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయిలతో పాటు వారి కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు ఇప్పట్లో శాంతించడానికి అంగీకరించడం లేదని వెలుగు చూసింది.

ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది
హిజాబ్ లు వేసుకుని రావడానికి అవకాశం లేదని కొన్ని కాలేజ్ లు, స్కూల్స్ యాజమాన్యం చెబుతోంది. ప్రభుత్వ స్కూల్స్ కాలేజ్ ల్లో మొదలైన హిజాబ్ వివాదం రెండుమూడు రోజుల్లో పెద్దదై కర్ణాటకతో పాటు దేశ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యింది. విద్యాసంస్థల్లో మొదలైన హిజాబ్ వివాదం రానురాను పెద్దదై రాజకీయ రంగు పులుముకుందని ఆరోపణలు ఉన్నాయి.

అమ్మాయిలకు ఏం చెప్పారంటే ?
విద్యాసంస్థల్లో హిజాబ్ వేసుకునే విషయంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో మడికేరిలోని ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ్ హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో అడుగుపెట్టిన విద్యార్థులను కాలేజ్ గేట్ ముందు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలను మనం కచ్చితంగా అమలు చెయ్యాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కాలేజ్ ప్రిన్సపాల్ విజయ్ ముస్లీం అమ్మాయిలె, వారి కుటుంబ సభ్యులకు మనవి చేశారని తెలిసింది.

నీకు టైమ్ దగ్గర పడింది...... చంపేస్తామని వార్నింగ్
ఆ సందర్బంలో కాలేజ్ గేట్ ముందు కాలేజ్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు ఎదురు తిరగడంతో రచ్చరచ్చ అయ్యింది. కాలేజ్ ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసిన వ్యక్తి నువ్వు ఎక్కువ రోజులు బతకవని, నీకు టైమ్ దగ్గర పడిపోయిందని, నిన్ను త్వరలో లేపేస్తామని, నీ కథ క్లోజ్ అయిపోతుందని మోహమ్మద్ తౌసిఫ్ అనే వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video

సైబర్ క్రైమ్ పోలీసుల ఎంట్రీతో
కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ్ నా ప్రాణాలు కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించి మోహమ్మద్ తౌసిఫ్ మీద కేసు పెట్టడంతో కలకలం రేపింది. ఇటీవల హిజాబ్ వివాదం మొదలైన ఉడిపితో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో హిజాబ్ విషయంలో అమ్మాయిలు పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు హిజాబ్ విషయంలో ఏకంగా ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ ను చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications