Viral video:హిజాబ్ ధరించి మరీ డ్యాన్స్, ఓనమ్‌లో ముస్లిం గర్ల్స్ హవా.. వైరల్

ఓనమ్..కేరళలో పెద్ద పండగ. కేరళీయులు వేడుకగా జరుపుకుంటారు. ఇవాళ ఓనమ్.. కావడంతో.. కొందరు ముస్లింలు కూడా ఈవ్ జరుపుకున్నారు. ఇదే భిన్నత్వంలో ఏకత్వం అంటే..అవును తమకు భేదాలు లేవని మరోసారి నిరూపించారు. అలా కొందరు హిజాబ్ ధరించి మరీ డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిని మీరు కూడా చూడండి.

హిజాబ్ ధరించి మరీ..

హిజాబ్ ధరించి మరీ..

వండూర్‌లో గల ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో కొందరు విద్యార్థులు డ్యాన్స్ చేశారు. సాంప్రదాయంగా చీర కట్టుకొని, మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులు వేశారు. హిజాబ్ ధరించిన వారు కూడా ఉత్సాహాంగా డ్యాన్స్ చేశారు. దాని పొరుగున గల కర్ణాటకలో ఇటీవల హిజాబ్ ఇష్యూపై గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేరళలో వారు డ్యాన్స్ చేసి.. జోష్ నింపారు. సో తమకు, భేదం లేదని నిరూపించారు.

శశిథరూర్ కూడా లైక్

మను సెబాస్టియన్ అనే ఒకరు ఆ వీడియోను ట్వీట్ చేశారు. దానిని కామ్రేడ్ మహబలీ అనే మరొకరు ట్వీట్ చేశారు. ఇదీ హిందువుల పండుగ అనేవారు, నిమ్న జాతులను తక్కువ చూసేవారికి అంకింతం అని రాసుకొచ్చారు. సదరు వీడియోను చాలా మంది లైక్ చేశారు. అందులో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఒకరు.. మరో ట్వీట్‌ను అశోక్ స్వేన్ అనే యూజర్ చేశారు. ఓనమ్ అనేది కేరళీయుల పండగ.. కొందరు హిందువులు చెప్పినట్టు వారి పండగ మాత్రమే కాదన్నారు. ఈ వీడియోను వేలాది మంది లైక్ చేస్తున్నారు. కరోనా వైరస్ తర్వాత ఈసారే పండుగ వైభవంగా జరుగుతుంది. అంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

వివాదం.. అంతలోనే డ్యాన్సులు

వివాదం.. అంతలోనే డ్యాన్సులు

దేశంలో భిన్నం సంస్కృతులు- సాంప్రదాయాలకు చెందినవారు ఉంటారు. అందుకే భారతదేశం ఉప ఖండం అని పిలుస్తారు. పండుగలను కూడా అన్ని మతాల వారు సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు, కొన్ని గ్రూపులు అల్లర్లు పాల్పడటంతో అశాంతి నెలకొంటుంది. కానీ మెజార్టీ పీపుల్ మాత్రం అంతా కలిసే ఉంటున్నారు. తమ ఐక్యతను చాటుతున్నారు. కర్ణాటకలో వివాదం నెలకొనగా.. కేరలో హిజాబ్ ధరించి డ్యాన్స్ చేసి.. తామంతా ఒక్కటేనని చాటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+