మహిళతో గొడవకు దిగిన దుండగుడు: రెండు కాళ్లు తీసి బండక్కొట్టింది(వీడియో)

ముంబై: తనతో గొడవకు దిగిన ఓ వ్యక్తిని ఎంతో సాహసంతో ఎదుర్కొందీ మహిళ. తనతో గొడవపడి ఘర్షణకు దిగడంతో అతడి చెంపలు వాయించిన ఆమె.. ఆ తర్వాత రెండు కాళ్లు తీసి అమాంతం అతడ్ని నేల మీద ఎత్తేసింది. పోకిరీలను ఎదుర్కొనేందుకు ఈ మహిళ బుద్ధిచెప్పిన తీరును చూసి మిగతా మహిళలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కింద ఇచ్చిన వీడియోను చూస్తే అర్థమవుతుంది.

 Watch: Indian woman shows her WWE skills

వివరాల్లోకి వెళితే.. ప్రయాణం నిమిత్తం సదరు మహిళ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చిన ఓ దుండగుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ అతడి చెంపలు వాయించింది. అంతేగాక, అతడ్ని రెండు కాళ్లు పట్టుకొని నేలకొట్టింది. ఆమె సాహసం చూస్తే డబ్ల్యూడబ్ల్యూఈ గుర్తుకు వచ్చేలా ఉంది.

రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి ఆన్‌లైన్లో పెట్టాడు. కాగా, ఈ వీడియోను వీక్షించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ వ్యక్తి ఆమెతో ఎందుకు గొడవ పెట్టుకున్నాడో తెలియదు. ఏదేమైనా దుండగుడికి బుద్ధి చెప్పిన మహిళదే విజయంగా చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+