video viral:చిన్నారి వినయం, సైనికుడి పాదాలకు నమస్కారం, వైరల్

వానలో.. చలిలో వణుకుతూ.. దేశ రక్షణ కోసం సైనికులు కాపాలా కాస్తుంటారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి సైనికులు కనిపిస్తే ఈ రోజుల్లో గౌరవించడం తక్కువే.. కానీ ఓ చిన్నారి సైనికుడి పాదాలను తాకింది. అతను కూడా ఆప్యాయంగా తలపై నిమిరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతుంది.

పాదాలను తాకి..

పాదాలను తాకి..


వీడియోను బీజేపీ ఎంపీ పీసీ మోహన్‌ షేర్ చేశారు. చిన్నారి సైనికుడి పాదాలను తాకింది. మెట్రో స్టేషన్‌ వద్ద నలుగురు ఆర్మీ జవాన్లు నిలబడి ఉన్నారు. వారి వద్దకు చిన్నారి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ చిన్నారి.. కొద్దిసేపు వారిని అలా చూస్తుండిపోయింది. తర్వాత ఒకరి పాదాలను తాకి, దండం పెట్టుకుంది. దీంతో ఆ సైనికుడు ఉద్వేగానికి లోనయ్యాడు. అమ్మాయి తలపై తన చేతిని ఉంచి, ఆశీర్వదించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

పాపకు ఆశీస్సులు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ పాపకు ఆశీస్సులు అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి కుమార్తెకు ఇంత అద్భుతమైన విలువలు ఇచ్చినందుకు ఆ పాప పేరంట్స్‌కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. వీడియోను వీడియోను ఇప్పటికే 15 వేల మంది రీ ట్వీట్ చేశారు. 1.1 వేల మంది ట్వీట్ చేశారు. 1.3 మిలియన్ల సార్లు చూశారు. 95.7 కే లైకులు వచ్చాయి.

గౌరవం, మర్యాద

గౌరవం, మర్యాద


పిల్లలకు చిన్నతనం ఈ విషయాలు నేర్పించాలని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇది భారతీయత, ఇది మన సంస్కృతి అంటూ రాసుకొచ్చాడు. నిజమే పిల్లలకు నేర్పించాల్సింది ముమ్మాటికీ ఇదే. వారికి మనం గౌరవం, మర్యాద గురించి చెబితే.. ఒక తరం వారికి మంచిని చెప్పినవారిమి అవుతాం. ఆ చిన్నారి అందరి మనసులను కదిలించింది. సైనికుల పట్ల తనకు ఉన్న మంచి ధృక్పథాన్ని తెలియజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+