కొడుక్కి అడ్మిషన్ ఇవ్వలేదని కలెక్టరేట్‌లో డ్యాన్స్(వీడియో)
భోపాల్: తన కొడుకును పాఠశాలలో చేర్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో ఆగ్రహించిన ఓ తండ్రి అధికారులు ముందు డ్యాన్స్ చేసి నిరసన తెలిపాడు. పెరిగిన ఫీజులు చెల్లించలేనని మొరపెట్టుకున్నా వినకపోవడంతో ఈ మేరకు నిరసన తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మాండసోర్‌కి చెందిన దశరథ్ సూర్యవంశీ అనే వ్యక్తి.. పాఠశాల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నానని, తన కుమారుడికి ఎలాగైనా విద్యావకాశం కల్పించాలని కోరుతూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నాడు.

అయినా ఫలితం నిపించకపోవడంతో ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా ఉన్నతాధికారుల ముందు డాన్స్ చేశాడు. దీంతో షాకైన కలెక్టర్ సంబంధించి చర్యలకు ఆదేశించారు.
కాగా, సూర్యవంశీ కుమారుడి అడ్మిషన్ కోసం స్థానిక ప్రైవేటు స్కూలు రూ. 27 వేలు డిమాండ్ చేసింది. దీంతో ప్రాథమిక విద్యాహక్కు చట్టం ద్వారా తనకు న్యాయం చేయాలంటూ అతడు జిల్లా అధికారులను ఆశ్రయించాడు. సూర్యవంశీ కుమారుడికి విద్యావకాశం కల్పిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications