Viral video:తోపుడు బండిపై గర్బిణీ, లేని సిబ్బంది.. వీడియో వైరల్, రియాక్టైన ఆఫీసర్స్
నిరుపేదలకు సర్కార్ దవాఖానే దిక్కు.. వాటిలో ఆధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తామని పాలకులు చెబుతారు. కానీ అవీ కొన్నిచోట్ల కార్యరూపం దాల్చడం లేదు. జ్వరమో.. ఇతర ఇబ్బంది అయితే ఫర్లేదు.. నిండు చులాలకు వైద్యం అందని పరిస్థితి. అవును మధ్యప్రదేశ్‌లో హృదయ విదారకర ఘటన జరిగింది. అదీ ప్రతీ ఒక్కరినీ మనస్సును కలచివేస్తోంది. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ఫోన్ చేసినా రానీ అంబులెన్స్..
మధ్యప్రదేశ్ దమో జిల్లా రావే గ్రామానికి చెందిన ఒకరికి ఈ ఘటన జరిగింది. వారు పేదలు కావడంతో.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్థోమత లేదు. గర్భిణికి నెలలు నిండాయి. డెలివరీకి ఉంది. అయితే నిన్న (మంగళవారం) ఆమె భర్త అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆ సిబ్బంది రెండు నుంచి మూడు గంటలు పడుతుందని చెప్పారు. ఇంకేముంది.. ఏం చేయాలో అతనికి తోచలేదు. తోపుడు బండి తీసుకొచ్చాడు. దానిపై ఆమెను పడుకోబెట్టి.. దగ్గరలో గల ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయినా.. నో యూజ్.. అక్కడ వైద్యులు, నర్సులు లేరు. దీంతో షాక్ తిన్నాడు.

తోపుడు బండిపై తీసుకెళ్లి..
గర్బిణీని తోపుడు బండిపై తీసుకెళ్లిన ఘటనను కొందరు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ట్రోల్ అవుతుంది. నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీంతో పాలకులు దిగి రావాల్సి వచ్చింది. మెడికల్ ఆఫీసర్ ఆర్‌పీ కోరి స్పందించారు. ఆ గర్బిణీని దమో జిల్లా కేంద్రంలో గల ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్య సహాయం అందజేస్తున్నామని తెలిపారు. కానీ వీడియో మాత్రం తెగ వైరల్ అయ్యింది.
నోటీసులు
ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రానికి చెందిన సిబ్బందికి ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అాలాగే అంబులెన్స్ ఎందుకు పంపించలేదని అడిగారు. బాధితుడు మాత్రం 2 గంటల వరకు అంబులెన్స్ రాలేదని చెబుతున్నారు. దీంతో తోపుడు బండిపై తీసుకెళ్లానని చెప్పారు. అక్కడి నుంచి మండల కేంద్రం.. అక్కడి నుంచి దమోకు తరలించి.. చికిత్స అందజేస్తున్నారు. కానీ వీడియోలు పోస్ట్ చేస్తే తప్ప పాలకులు స్పందించలేదు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications