Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏటీఎంలో చిన్నారికి తుపాకీ పెట్టి దంపతుల నుంచి దోపిడీ(వీడియో)

ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దొంగ ఏటీఎంలో దోపిడీకి తెగబడ్డాడు. జనవరి 24నే ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోజు రాత్రి 8.30కు ఓ దంపతులు తమ చిన్నారితో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లారు.

ఇంతలోనే వాళ్ల వెనక ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి ఏటీఎంలోకి చేరుకొని తుపాకీతో వాళ్లను బెదిరించాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తి తన జేబులో ఉన్న డబ్బు తీసి ఇచ్చాడు. అంతటితో సంతృప్తి చెందని దొంగ.. ఆ దంపతుల చిన్నారికి తుపాకితో గురిపెట్టి ఏటీఎం నుంచి డబ్బులు తీసి ఇవ్వాలని బెదిరించాడు.

దీంతో చేసేదేం లేక.. ఆ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులను డ్రా చేసి మరీ ఆ దుండగుడికి ఇచ్చాడు. అనంతరం ఆ దుండగుడు ఆ డబ్బులతో పరారయ్యాడు. ఈ ఘటనంతా ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+