ఆస్పత్రేనా?: నర్సులు, మహిళల చిందులు(వీడియో)
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు ఎప్పుడూ రోగులతో రద్దీగానే ఉంటాయి. రాజధాని నగరం కావడంతో సుదూర ప్రాంతాలను నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. వారందరికి తగిన వైద్య సహాయం అందించడం వైద్యులు, సిబ్బంది బాధ్యత. కాగా, అది మర్చిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది.. రోగులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారు.
ముంబైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మ్యూజిక్, డాన్స్ లతో హోరెత్తించారు. సిబ్బంది ఆస్పత్రిని ఏకంగా ఫంక్షన్ హాల్‌లా మార్చేశారు.ఆస్పత్రిలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి మైనర్ అమ్మాయిలతో డాన్స్లు చేయించారు. పెద్దగా సౌండ్ వచ్చేలా పాటలు పెట్టి మరీ డాన్స్ చేయించారు.
WATCH: Minor girls dance as part of cultural program inside OPD of a Mumbai's civic hosp (Mar 2)(Source: unverified)https://t.co/KokUOacSzL
— ANI (@ANI_news) May 11, 2016
అంతేగాక, వారితోపాటు నర్సులు, మహిళలు చిందులేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యం కలుగుతుందన్న ఆలోచనే లేకుండా సంబరాలు చేసుకున్నారు. ఈ వైద్య సిబ్బంది నిర్వాకం వల్ల రోగులు ఇబ్బందులకు గురయ్యారు.
కాగా, డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ విషయం బహిర్గతమైంది. పలువురు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. అయితు, ఈ డ్యాన్సుల కార్యక్రమం ఏ ఆస్పత్రిలో ఎప్పుడు జరిగిందన్న వివరాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications