Mongoose vs Snake:ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి...షేక్ అయిపోతారు..!

ఎవరైనా ఇద్దరికీ పడకపోతే వారిని పాము ముంగీసలతో పోలుస్తాం. ఒకరు పామైతే మరొకరు ముంగీస అని అంటాం. ఇలా ఎందుకంటామంటే ఈ రెండిటి మధ్య ఉన్న వైరం అలాంటిది. అందుకేవారిని పాము ముంగీసలతో పోలుస్తాం. ఇక అసలు విషయానికొస్తే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పాము ముంగీసలు యుద్ధానికి దిగాయి. ఈ వీడియోను చూసిన వారు ఒక్కసారితో ఆపడం లేదు. మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అంతలా ఈ పాము ముంగీసల ఫైట్ కలిగి ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది.


ఇక అసలు స్టోరీలోకి వస్తే.... ఐఎఫ్‌ఎస్ అధఇకారి ప్రవీణ్ అంగుసామి ఈ పాము ముంగీస వీడియోను ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. ఓ పాము చెట్టుపై హాయిగా విశ్రాంతి తీసుకుంటుండగా... ఆ చెట్టుకిందే ఉన్న ఓ ముంగీసా దీన్ని చూసింది. ఇంకేముందు ఎక్కడా లేని కోపంతో ఊగిపోయింది ముంగీస. చెట్టుపై ఉన్న పామును ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి నోటితో కర్చుకుంది. గాల్లోనే కాసేపు పోరాటం చేసింది. దీంతో పాము పట్టు కోల్పోయి చెట్టు పై నుంచి కింద పడింది. ఈ పాము కూడా బుసకొట్టి ముంగీసను నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ ఫలించలేదు. ఎప్పటిలానే ఈ పోరులో ముంగీసదే పైచేయి అయ్యింది. ముందుగా ఈ వీడియోను డీసీఎఫ్ వెస్ట్ నాషిక్ తన ట్విటర్ హ్యాండిల్‌పై పోస్టు చేస్తూ ఓ మంచి క్యాప్షన్ పెట్టింది. జంతువు ఎంత చిన్నదైతే అంత పోరాడేతత్వం కలిగి ఉంటుందనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు.

Watch:Mongoose and Snake fight shared by an IFS officer goes viral on social media

ఇక ట్విటర్‌లో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వీడియో మరింత వైరల్ అయ్యింది. అయితే పాము ముంగీసల మధ్య జరిగిన ఫైట్ వీడియో వైరల్ కావడం ఇది తొలిసారి కాదు. గత నెలలో కూడా ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. నడిరోడ్డుపై ముంగీస నాగుపాముల మధ్య భీకర పోరు జరిగింది. వాహనదారులు అలానే రోడ్డుపై తమ వాహనాలను నిలిపి వాటి మధ్య ఫైటింగ్ కాసేపు వీక్షించారు. నాగుపాము బుస కొట్టగా ఆ పాము కోరలు తీసేందుకు ముంగీస ప్రయత్నించింది. మొత్తానికి ఆ రోజు అక్కడే ఉన్న వాహనదారులకు మాత్రం ముంగీస నాగుపాముల మధ్య జరిగిన పోరు మాంచి విజువల్ ఫీస్ట్‌ను ఇచ్చింది. మొత్తానికి ఈ వీడియోలు నిజంగానే ఒళ్లు గొగుర్పొడిచేలా ఉన్నాయి కదూ..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+