వీడియో: నెమళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ సందడి, ఇంటర్నెట్‌లో వైరల్

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. జాతీయ పక్షులు నెమళ్లకు ఆహార పదార్థాలను తినిపిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఢిల్లీలోని తన నివాసంలో నెమళ్లతో కలిసి సందడి చేశారు మోడీ. సాధారణంగా నెమళ్లను మచ్చిక చేసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు.

Recommended Video

    PM Modi Feeding Peacocks At Residence | జాతీయ పక్షి తో ప్రధాని!! || Oneindia Telugu

    కానీ, ఈ నెమళ్లు ఎంతో స్వేచ్ఛగా నరేంద్ర మోడీ నివాసంలో కలిగియతిరుగుతుండటం విశేషం. పురివిప్పి నాట్యమాడాయి. వాటికి ఆయన తన చేతులతో స్వయంగా ఆహారాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో కూడిన ఓ పోస్టును నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

     Watch: PM Modi Shares Video Of His Bond With Peacocks At His Residence

    కాగా, ప్రకృతి ప్రేమికులైన ప్రధాని నరేంద్ర మోడీ నివాసం పూల మొక్కలు, చెట్లతో సుందరంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లున్న సమయంలోనూ.. అలాగే వాకింగ్ చేస్తున్న సమయంలోనూ నెమళ్లు స్వేచ్ఛగా ఆయన సమీపంలోనే తిరుగుతున్నాయి.

    1.47 నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోలో.. పలు సందర్భాల్లో మోడీ సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. మరికొన్నిసార్లు వివిధ రకాల దుస్తుల్లోనూ ఆయన కనిపించారు. ప్రస్తుతం మోడీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోడీ అభిమానులను ఈ వీడియో మరింత ఆకట్టుకుంటోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+