వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ స్త్రీలను కించపరిచేలా.. నెట్‌లో వివాదస్పద వైరల్ వీడియో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జనాలకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సెన్సేషన్ కోసమో, పాపులారిటీ కోసమో.. కొన్ని వివాదస్పద వీడియోలను చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లోకి వదలడం కొనసాగుతూ వస్తోంది. సినిమాల్లో పాపులర్ సీన్స్ కు స్పూఫ్స్ చేసేవారు కొందరైతే.. పాపులర్ సాంగ్స్ ను పేరడీగా మార్చేసేవారు మరికొందరు.

అయితే కంటపడగానే వీడియోలను క్లిక్ మనిపించేలా చేయాలన్న ఆతృతతో.. దానికి కాస్త మసాలా దట్టించడానికి కూడా వెనుకాడడం లేదు. దీంతో సోషల్ మీడియాలో వివాదస్పద వీడియోల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే తరహాలో 'పెన్ పైనాపిల్.. యాపిల్ పెన్' అనే మరో వీడియో తాజాగా వివాదంలోకి ఎక్కింది.

ప్రపంచాన్నంతా ఓ ఊపు ఊపిన గంగ్నమ్ స్టైల్ కు పేరడీగా వచ్చింది ఈ పాట. ఇంటర్నెట్లో అప్ లోడ్ చేశారో లేదో జనాలంతా ఈ వీడియోను చూడడానికి ఎగబడడంతో.. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన పాటగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోను చోటు సంపాదించుకుంది. అయితే భారతీయ స్త్రీలను కించపరిచేలా వీడియోలోని మహిళ వస్త్రధారణ ఉందనేది ప్రస్తుతం వీడియోపై నెలకొన్న వివాదం.

దీంతో చాలామంది ఇండియన్ నెటిజెన్స్ వీడియోపై మండిపడుతుండడంతో.. వీడియోను రూపొందించిన వ్యక్తి క్షమాపణలు చెప్పక తప్పలేదు.

English summary
We have all rejoiced to the absolutely addictive PPAP (Pen Pineapple Apple Pen) song which has now created a record of sorts. So, obviously any parody of the hit song would attract attention too. Sadly it all did not end well for a Hong Kong actor Derek Wong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X