వీడియో హల్‌చల్: మరో ఆకతాయిని చితకబాదిన రోహ్‌తక్ అక్కా చెల్లెళ్లు
ఛండీఘర్: రోహ్‌తక్ అక్కాచెల్లెళ్లకు సంబంధించిన మరో వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో తమ పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఓ ఆకతాయిని చితకబాదారు ఆ అక్కా చెల్లెళ్లు పూజ, ఆర్తి. ఈ ఘటనపై వారు మాట్లాడుతూ.. ఇది ఒక నెల క్రితం జరిగిన ఘటన అని చెప్పారు.
ప్రస్తుతం అది మీడియాలో ప్రసారమవుతోందని అన్నారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ ఇద్దరు సోదరీమణులు చెప్పారు. పార్కు సమీపంలో ఆ యువకుడ్ని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రచారం కోసమే ఇలాంటి చర్యలకు దిగుతున్నామనడం సరికాదని ఆ సోదరీమణులు అన్నారు. ఈ అక్కా చెల్లెళ్లు ఇటీవలే బస్సులో తమను వేధింపులకు గురి చేసిన ఓ యువకుడ్ని బెల్టుతో చితకబాది పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనను మొబైల్ ఫోన్‌లో వీడియో తీసిన కొందరు మీడియాతో పాటు సోషల్ మీడియాకు అందించారు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు చూపిన ధైర్య సాహాసాలు ప్రపంచానికి తెలిసింది. దీంతో దేశం మొత్తం వారిని ప్రశంసించింది. అంతేగాక హర్యానా సిఎం ఖట్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అంతేగాక గణతంత్ర దినోత్సవం రోజు వారిని సన్మనించనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications