బీజేపీ సీనియర్ నేత స్వామికి అవమానం: కోడిగుడ్లతో దాడి (వీడియో)

కాన్పూర్: బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామికి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా నవాబ్ గంజ్‌లోని వీఎస్ఎస్డీ కాలేజీలో 'ప్రపంచ తీవ్రవాదం' పై ఏర్పాటు చేసిన సెమినార్ కార్యక్రమానికి హాజరవుతున్న ఆయన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Watch: Subramanian Swamy's car pelted with eggs and tomatoes in Kanpur

నల్లజెండాలు ప్రదర్శిస్తూ ఆయన కారుపై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. అంతేకాదు నల్ల ఇంకుని సైతం చల్లారు. దీంతో కాన్పూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తెలత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో సుబ్రమణ్యం స్వామికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపి, కారుపై కోడిగుడ్లు, టమోటాలు విసిరి అవమానించారు.

వీరిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలక మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పై లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+