VIRAL:తాత నువ్ సూపర్, సిగరెట్ పీకతో రాకెట్లు వెలిగించి, పైకి వేస్తూ.. వావ్
ఇవాళ దివాళి పండగ. దేశంలో ఫెస్టివల్ వైబ్ వచ్చేసింది. అందరూ పిండి వంటలు చేసుకొని.. లక్ష్మీదేవిని కొలుస్తున్నారు. అయితే కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దివాళి సందర్భంగా ఒకతను విచిత్రంగా పటాసులు కాల్చారు. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు.

రాకెట్లను పట్టుకొని..
అతను రాకెట్ సెట్ పట్టుకొని ఉన్నాడు. అయితే సిగరెట్ తాగుతూ.. సిగరెట్ పీకకు రాకెట్ పెట్టి వెలిగించాడు. పీకకు ఉన్న నిప్పుతో వాటికి అంటుకోగానే పైకి వదిలాడు. అలా ఆ రాకెట్లు పైకి వెళ్లాయి. కానీ ఆ వీడియో చూస్తే ఔరా అనిపించక మానదు. ఎందుకంటే.. అతను చేసిన ఫీట్ నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

అదరలేదు, బెదరలేదు
అతను ఏమీ భయపడలేదు. చక్కగా అంటించాడు. టైమింగ్ మిస్ కాలేదు. వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. దీనికి నందా.. ఇండియాకు చెందిన నాసా ఫౌండర్ అని క్యాప్షన్ ఇచ్చారు. నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. వీడియోను ఈ నెల 21వ తేదీన పోస్ట్ చేశారు. ఇప్పటికే 980.9కే వ్యూస్ వచ్చాయి. 22.4కే లైకులు కొట్టారు. 2 వేల మంది రీ షేర్ కూడా చేశారు.
స్పేష్ ఎక్స్, రాకెట్ మ్యాన్
అతనిని ఒకరు రాకెట్ మ్యాన్‌గా అభివర్ణించారు. స్పేష్ ఎక్స్‌లోకి అతనిని ప్రవేశపెట్టాలని కోరారు. అతనిని ఎలాన్ మాస్క్ ప్రవేశపెడతారెమోనని అభిప్రాయపడ్డారు. దేశంలో ఓ చోట రాకెట్లను ఎలా ప్రవేశపెట్టారని ఒకరు సైటెరికల్‌గా కామెంట్ చేశారు.

డేంజరే
ఇదీ డేంజరస్ అని మరొకరు రాశారు. కానీ అతని టాలెంట్ వృథా కానీయరాదు అని అన్నారు. అతనిని ప్రతీ ఒక్కరు అభినందించాల్సిందేనని తెలిపారు. దీనిని ఆంధ్రప్రదేశ్‌లో తారా జువ్వ అంటారని ఒకరు రాశారు.












Click it and Unblock the Notifications