Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాతీయగీతం: థియేటర్ నుంచి బయటకు గెంటేశారు(వీడియో)

హైదరాబాద్: థియేటర్‌లోని తెరపై జాతీయగీతం వచ్చే సమయంలో లేచి నించోలేదని ఓ కుటుంబాన్ని బయటకు గెంటివేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా ఇప్పటి వరకు దీనిని 2,500 షేరు చేశారు.

సుమారు 2.40 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో ప్రేక్షకులు ఆ కుటుంబాన్ని థియేటర్‌లో నిలదీశారు. సినిమా కోసం నాలుగు గంటల పాటు కూర్చుంటారు కానీ, జాతీయగీతం వచ్చే సమయంలో లేచి నిల్చోవాలనే కామన్ సెన్సు లేదా వారిని ఆ వీడియోలో ప్రశ్నించారు.

ఆ కుటుంబాన్ని థియేటర్ నుంచి బయటకు గెంటివేసిన అనంతరం చప్పట్లతో థియేటర్ మొత్తం మారుమ్రోగింది. అయితే ఈ సంఘటన ఏ నగరంలో జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు.

మీడియాలో వస్తున్న కథనం ప్రకారం ముంబైలోని కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న పీవీఆర్‌లో తమాషా సినిమా సందర్భంగా జరిగిందని అంటున్నారు. అయితే మరికొందరు బెంగుళూరులోని పీవీఆర్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+