గలీజుగాడు: పెళ్లి విందులో రోటీలు చేయమంటే.. ప్రతిరోటి మీద ఉమ్మివేసి..(వీడియో)
లక్నో: పెళ్లి విందుకు పసందైన రోటీలు చేయాలని పిలుపించుకుంటే.. ఆ వ్యక్తి అత్యంత అసహ్యకరమైన పని చేశాడు. తాను చేసే ప్రతి రోటీ మీద ఉమ్మివేశాడు. అయితే, అతని నిర్వాకమంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీంతో అతని గలీజు పని బట్టబయలైంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిన వ్యక్తిని మీరట్‌కు చెందిన సొహైల్‌గా గుర్తించారు. ఇక వీడియో చూసిన నెటిజర్లు సదరు రోటి చేసిన వ్యక్తిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

పది మందికి పెట్టే భోజనంలో ఇలాంటి అసహ్యమైన పనిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని మరెక్కడా కూడా ఇలా చేయకుండా శిక్షించాలంటున్నారు. ఈ వ్యక్తి గలీజు పని గుర్తించకుండా ఆ రోటీలను కార్యక్రమానికి వచ్చినవారు తిన్నారా? లేదా? అని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.
इसके हाथों की रोटी कौन-कौन खाना चाहेगा pic.twitter.com/x8GFXbrlUy
— @tweetBYपत्रकार (@kumarayush084) February 19, 2021












Click it and Unblock the Notifications