Viral Video:సూపర్ గురూ, గంట లేట్‌గా డెలివరీ, కుంకుమ పెట్టి, అక్షింతలు వేసి,
ఫుడ్ డెలివరీ ఏజెంట్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సమయానికి డెలివరీ ఇచ్చేందుకు వారి పాట్లు మాములుగా ఉండవు. నిర్దేశిత సమయంలో డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆలస్యం అయితే కస్టమర్ నుంచి చివాట్లు తప్పవు. కొందరు అయితే ఘోరంగా తిడతారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఒకరు చిత్రంగా ప్రవర్తించారు. అదేంటో మీరు కూడా చూడండి.
దసరా- దీపావళి ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. ఇక ఢిల్లీలో అయితే ట్రాఫిక్ చిక్కులు మాములుగా ఉండవు. దానికిపైగా వర్షం కూడా పడుతోంది. కానీ ఒకరు మాత్రం డెలివరీ బాయ్‌ను వెల్ కం చేశారు. పైగా అతనికి కుంకుమ పెట్టి, అక్షింతలు వేశారు. ఆ వీడియోను సంజీవ్ త్యాగి అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌లో వేశారు. ఇంకేముంది అదీ తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆ వీడియోకు 4.8 మిలియన్ వ్యూస్.. 428కే లైకులు వచ్చాయి.

ట్రాఫిక్‌లో కూడా ఆర్డర్ తీసుకొచ్చారని రాసుకొచ్చారు. ఆ వ్యాపారి అతని పట్ల ప్రేమను వ్యక్తం చేశారు. డెలివరీ ఏజెంట్ కోసం అతను వెయిట్ చేశాడు. ఆయే ఆప్కే ఇంతెజార్ తా అని పాడారు. డెలివరీ ఏజెంట్ నవ్వుతూనే.. హెల్మెట్ తీశారు. అతను కంకుమ పెట్టి.. అక్షింతలు వేయడంతో హ్యాపీగా ఉన్నాడు.
డెలివరీ ఏజెంట్‌ను సరిగ్గా అర్థం చేసుకున్నాడని ఒకరు రాశారు. మరొకరు డెలివరీ ఏజెంట్ పాసయ్యాడని రాశారు. చాలా మంది దాడి చేసి, తిడతారని చెప్పారు. కానీ ఇతను మాత్రం చక్కగా బిహెవ్ చేశారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications