కోల్‌కతాలో ముగ్గురు అల్ ఖైదా టెర్రర్ గ్రూప్ అనుమానితుల అరెస్ట్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ముగ్గురు అనుమానిత అల్ ఖైదా తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగాల్‌కు చెందిన ఎస్టీఎఫ్ పోలీసులు వారిని కోల్‌కతా రైల్వే స్టేషన్లో అరెస్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ముగ్గురు అనుమానిత అల్ ఖైదా తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగాల్‌కు చెందిన ఎస్టీఎఫ్ పోలీసులు వారిని కోల్‌కతా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు.

వారి నుంచి పోలీసులు అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషద్్ మియా అలియాస్ తన్వీర్ అలియాస్ సైఫుల్ అలియాస్ తుషార్ బిశ్వా (26)గా గుర్తించారు. ఇతను బంగ్లాదేశ్‌వాసి.

WB: 3 suspected terrorists of Al-Qaeda terror outfit nabbed in Kolkata

మరో ఇద్దరిలో బంగ్లాదేశ్‌కు చెందిన రిజౌల్ ఇస్లామ్ అలియాస్ రియాజ్ అలియాస్ సుమోన్ (25), బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలోని ఖోలాపోటాకు చెందిన మోనోటోష్ డే అలియాస్ మోనా దా (46)గా గుర్తించారు.

ఈ మేరకు కోల్‌కతా ఎస్టీఎఫ్ పోలీసు అధికారి మురళీధర శర్మ మాట్లాడారు. ముగ్గురిని ఎస్టీఎఫ్ టీం అరెస్టు చేసినట్లు చెప్పారు. వారు ఏడాదన్నరగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+