4 చేతులు, కాళ్లతో జన్మించిన శిశువు: దేవుడని..(ఫొటో)

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరాయిపూర్ గ్రామంలో ఓ శిశువు నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించాడు. ఆ చిన్నారిని చూసేందుకు స్థానిక, పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాగా, తమ చిన్నారి దేవుడని ఆ చిన్నారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఇది ఇలా ఉండగా సంపూర్ణంగా వృద్ధి చెందని కవల పిల్లలు చాలా అరుదుగా ఇలా జన్మిస్తారని వైద్యులు చెబుతున్నారు. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం.. స్థానికులు ఆ చిన్నారని బ్రహ్మదేవుడి అవతారంగా భావిస్తున్నారు.

WB: Baby boy born with 4 arms, 4 legs; dubbed as “Hindu God” by parents

ఆస్పత్రిలో ఉన్న ఆ చిన్నారిని చూసేందుకు వేలాది మంది గ్రామస్తులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తరలివస్తున్నారు. ఆ దేవుడే తమ ఇంట్లో చిన్నారి రూపంలో జన్మించాడని ఆ చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, శిశువుకు అదనంగా ఉన్న రెండు చేతులు, రెండు కాళ్లు సంపూర్ణంగా వృద్ధి చెందని కవల శిశువువికి చెందినవని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. శిశువు అసహజ రీతిలో జన్మించాడని, అతనికి దైవశక్తి ఏమిలేదని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఇది ఒక విషాదమని తెలిపారు.

విచత్రంగా ఉన్నందునే అనేకమంది ప్రజలు చిన్నారిని చూసేందుకు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. శిశువును చూసిన కొందరు ఏడుస్తున్నారని, మరికొందరు ఇక్కడే శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఈ అసహజమైన శిశువు జననం ప్రపంచ అంతానికి గుర్తు అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+