అమ్మ పథకాలను కొనసాగిస్తాం, ఇప్పటికే 121 హమీలను అమలు చేశాం
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీల్లో 121 హమీలను అమలు చేసినట్టు ఆయన చెప్పారు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ది పథకాలను కొనసాగిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తామని చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.చెన్నై నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
చెన్నైకు నీటి ఎద్దడి నివారించేందుకుగాను రూ.5,700 కోట్లతో నిర్లవణీకరణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
బుదవారం నాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రసంగించారు.

అమ్మ పథకాలు కొనసాగిస్తాం
గత ఐదేళ్ళలో అమ్మ చేపట్టిన అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామని తమిళనాడుప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యారంగం అభివృద్దికి చేపట్టిన పలు పథకాలను గణాంకాలతో ఆయన వివరించారు. ఉన్నత విద్యాపరంగా జాతీయ స్థాయిలో తమిళనాడు ప్రథమస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు.జయలలిత ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.అమ్మ ప్రారంభించిన సమగ్ర వైద్యభీమా పథకం కింద రూ1.58 కోట్లను కేటాయించినట్టు ఆయన ప్రకటించారు.ఈ ఏడాది జనవరి 11 నుండి ఈ పథకంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు సిఎం ప్రకటించారు.

ఉన్నత విద్యలో తమిళనాడు ప్రథమం
జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో తమిళనాడు రాష్ట్రం అగ్రగ్రామిగా ఉందని పన్నీర్ సెల్వం ప్రకటించారు.దేశ వ్యాప్తంగా 23.6 శాతం ఉన్నత విద్యలో ఎన్ రోల్ మెంట్ ఉంటే, తమిళనాడులో 44.8 శాతంగా ఉందని ఆయన చెప్పారు. ఉన్నత విద్యరంగంలో తమిళనాడు అగ్రగామిగా కొనసాగేందుకుగాను ప్రస్తుతమున్న పథకాలను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

కరవు సహయం చేయాలని కేంద్రానికి వినతి
వర్ద తుపాణ్ బాధిత ప్రాంతాల్లో సహయ పనులకు రూ.585.45 కోట్లను కేంద్రం నిధులను కేటాయించింది. అయితే ఇందులో రూ.498 కోట్లను ఖర్చుచేసినట్టు సెల్వం వివరించారు.తమిళనాడును కరవు రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.గత నెలలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

పెట్టుబడుల వరద
తమిళనాడు రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వచ్చాయని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రకటించారు.ఐదేళ్ళలో31,706 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 33 అవగాహన ఒప్పందాలపై కూడ సంతకాలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆ పథకాలు యథాతథం
రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం అందించే పథకం, అతి తక్కువ ధరకు పప్పు రకాలు,వంటనూనె అందించే పథకం, తాళికి 8 గ్రాముల బంగారంతో పాటు 59 వేల వరకు వివాహ సహయపథకం, రూ.12 వేల ప్రసూతి సాయం పథకం, ఉచిత పాడి,పశువులు, మేకలు అందించే పథకం, ఉచిత మిక్సీ, గ్రైండర్లు , విద్యుత్ ప్యాన్లు , హరిత నివాసాల పథకం,రూ.వెయ్యి రూపాయాల వృధ్యాప్య పింఛన్ పథకాలను కొనసాగుతాయని పన్నీర్ సెల్వం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 321 హమీలిస్తే 121 హమీలను నెరవేర్చినట్టు ఆయన ప్రకటించారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications