బీజేపీ కాదు, కాంగ్రెతోనే, మోడీది విశాల హృదయం: కనిమొళి, ‘జైల్లో మహాభారతం’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతోనే బంధం కొనసాగుతుందని డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీతో తమకు విభేదాలున్నాయని తెలిపారు. 2జీ కుంభకోణంలో నిర్దోషిగా బయటపడిన ఆమె శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
తన జైలు జీవితం నుంచి రాజకీయ పొత్తులు, కరుణానిధిని కలిసిన ప్రధాని మోడీ తదితర అంశాలపై స్పందించారు. 2జీ కేసులో పటియాల హౌస్ కోర్టు కనిమొళి, ఎ రాజాతోపాటు నిందితులందర్నీ నిర్ధోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

మోడీది విశాల హృదయం
డీఎంకే అధినేత కరుణానిధి నివాసానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి.. ఢిల్లీలోని తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించడం ప్రధాని విశాల హృదయానికి నిదర్శనమనీ, అయితే లౌకికపార్టీ అయిన తమకు బీజేపీతో విభేదాలున్నాయనీ ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పడం గమనార్హం.

కాంగ్రెస్‌తోనే.. శ్రీలంక విషయంలోనే..
కాంగ్రెస్-డీఎంకే మధ్య విభేదాలకు శ్రీలంక విషయమే కారణమనీ, 2జీ మాత్రం కాదనీ కనిమొళి తేల్చి చెప్పారు. 2జీ వివాదం తర్వాత కూడా తాము కలిసే పోటీ చేశామని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ తమ పొత్తు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

జైల్లో ఎంతో నేర్చుకున్నా..
జైలు జీవితం నిజంగా నన్ను బలంగా, వివేకవంతంగా తీర్చిదిద్దిందని కనిమొళి తెలిపారు. రాజకీయాలు ఎలా పనిచేస్తాయో అక్కడ తెలుసుకున్నట్లు చెప్పారు.

జైల్లో మహాభారతం చదివా
జైలులో ఉన్నన్నాళ్లూ మహాభారతం చదివినట్లు, రాజకీయాల గురించి ఆ గ్రంథం తనకు ఎంతో నేర్పిందని చెప్పారు. ఎలాంటి దృక్కోణాన్ని అలవరచుకోవాలో వివరించిందని కనిమొళి తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications