తమిళనాడుకు తరలింపుపై ప్రభుత్వం, జయ నిరాకరణ

బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తమిళనాడు జైలుకు తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నాటక హోంశాఖ సోమవారం స్పష్టం చేసింది. దీని పైన పొరుగు రాష్ట్రం తమిళనాడు కోర్టు నుండి అనుమతులు తీసుకుంటే కర్నాటక ప్రభుత్వానికి ఏ విధమైన అడ్డంకులు లేవని కర్నాటక హోంమంత్రి కేజే జార్జ్ తెలిపారు.

మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, మరికొంతమంది ఒత్తిడి నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. జయలలిత కర్నాటక జైలులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారమే కాకుండా.. మద్దతుదారుల ఆందోళనతో చట్టపరమైన సమస్యలు కూడా వస్తాయని దేవేగౌడ సూచించారు.

ఆమె కర్నాటక జైలులోనే ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని నిఘా అధికారులు ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

'We have no objection to shift Jayalalithaa'

జయను చూసేందుకు వేలాదిగా తమిళులు జైలు వద్దకు చేరుకొని గొడవ చేస్తున్నారని, సుప్రీం కోర్టులో జయ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది, అక్కడా బెయిల్ మంజూరు కాకుంటే కర్నాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని అధికారులు సీఎంకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

దీంతో కర్నాటక ప్రభుత్వం జయలలిత జైలు మార్పిడి విషయమై సానుకూలంగా స్పందించిందని అంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల పైన సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

జయలలిత నిరాకరణ

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్ 27వ తేదీ నుండి ఎవరిని కూడా కలిసేందుకు అనుమతించడం లేదు. పార్టీ ముఖ్య నేతలను, మంత్రులను.. ఎవ్వర్నీ కలిసేందుకు ఆమె ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+