భార్యకు ఐఫోన్ కోసం ఇంట్లో బంగారాన్నే అమ్మేశాడు.. !!

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్న యాపిల్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max)ల విక్రయాలు బెంగళూరులో ఆరంభం అయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ ప్రీమియం మోడళ్లను అందరికంటే ముందే సొంతం చేసుకోవడానికి జనం అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. విపరీతమైన క్రేజ్ కనిపించింది. గంటల కొద్దీ పడిగాపులు పడి ఐఫోన్లు కొనుగోలు చేస్తోన్నారు.

ఢిల్లీలోని యాపిల్ సాకేత్, ముంబైలోని యాపిల్ బీకేసీ అధికారిక స్టోర్లతో పాటు బెంగళూరులోని ప్రధాన విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. బెంగళూరు యలహంక సమీపంలోని ఫీనిక్స్ ఏసియన్ మాల్ లో యాపిల్ అధికారిక స్టోర్ వద్ద ఈ తెల్లవారు జాము నుంచే కొనుగోలుదారులు క్యూ కట్టారు. అమ్మకాలు ఆరంభం కాగానే ఎగబడ్డారు.

We Sold Gold for It Delhi Man s iPhone 18 Pro Gift Story to Buy the Burgundy Upgrade for His Wife

ప్రస్తుతానికి బెంగళూరులో ఏషియన్ మాల్ స్టోర్ లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగిలిన చోట్ల వీటి అమ్మకాలు ఆరంభం కావొచ్చు. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఆరు రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా నేరుగా సొంతం చేసుకోవచ్చు. ముంబై- బీకేసీ, ఢిల్లీ- సాకేత్, నాసిక్, నొయిడా- డీఎల్ఎఫ్ మాల్ వంటి చోట్ల ఉన్నాయి ఈ రిటైల్ అవుట్ లెట్స్.

బెంగళూరులో iPhone 18 Pro, 18 Pro Max అమ్మకాలు షురూ: స్టోర్ లొకేషన్.. !!
బెంగళూరులో iPhone 18 Pro, 18 Pro Max అమ్మకాలు షురూ: స్టోర్ లొకేషన్.. !!

వీటి కోసం ఐఫోన్ లవర్స్ ఎగబడుతున్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. వీటిపై ఇండియాటుడే ఓ కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఓ కొనుగోలుదారుడు తన భార్యకు ఐఫోన్ 18 ప్రో బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆమె బర్గండీ కలర్ తో ఉన్న ఫోన్ కావాలని అడగడంతో ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవడానికి ఇంట్లో ఉన్న బంగారాన్ని సైతం అమ్మేశాడు. ఇప్పటివరకు ఐఫోన్ వాడలేదని, ఈ న్యూ మోడల్ ద్వారా ఆమెకు దీన్ని గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.

బంగారానికి డిమాండ్ పిక్స్ అప్: పాజిటివ్ ట్రెండ్
బంగారానికి డిమాండ్ పిక్స్ అప్: పాజిటివ్ ట్రెండ్

పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ అనే యువకుడు తన కాబోయే భార్యకు ఐఫోన్ 18 ప్రొ కొనడానికి గురువారం రాత్రి అదేపనిగా నోయిడాకు వచ్చాడు. డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో గల స్టోర్ వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచే లైన్‌లో నిల్చున్నాడు. కాబోయే భార్య కోసం ఒక ఐఫోన్ ప్రో, తన కోసం మరొక ఐఫోన్ 18 ప్రో మాక్స్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఈ రెండు ప్రీమియం ఫోన్ల కొనుగోలు కోసం అతను ఏకంగా రూ. 3.50 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు.

ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

ఇదివరకటి మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 18 ప్రో ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ.. జనం మాత్రం లెక్కచేయట్లేదు. వెనక్కి తగ్గట్లేదు. ధర ఎక్కువైనా పర్వాలేదంటూ ఓ కొనుగోలుదారుడు చెప్పాడు. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ డ్యూయో మోడల్‌ను హాంగ్‌కాంగ్ నుంచి తెప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు హర్యానాకు చెందిన దంపతులు తెలిపారు. రేట్ల విషయంలో రాజీపడట్లేదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+