మానవతా సాయం హామీ: పాలస్తీనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్, పరిస్థితిపై ఆందోళన

న్యూఢిల్లీ: పాలస్తీనాకు అందించే మానవతా సాయాన్ని మరింత పెంచుతామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్బంగా గాజా ఆస్పత్రిపై బాంబు దాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలియజేశారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు భారత్ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారత్ అనుసరిస్తున్న దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించామని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

we will continue to send humanitarian assistance: PM Modi Speaks To Palestinian Prez Abbas

గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడిలో మరణించిన పౌరుల పట్ల సంతాపాన్ని తెలియజేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో టెలిఫోన్ సంభాషించారు. ఫోన్ కాల్ సందర్భంగా.. పాలస్తీనియన్లకు భారతదేశం మానవతా సహాయం పంపడం కొనసాగిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆస్పత్రిపై దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడాలని అన్నారు. కాగా, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ భీకరమైన దాడి చేసిన తర్వాత అబ్బాస్‌తో ప్రధాని మోడీ మాట్లాడటం ఇదే తొలిసారి.

అయితే, గాజాలోని అల్-అహ్లీ అరబ్ హాస్పిటల్‌లో మంగళవారం పేలుడు సంభవించి సుమారు 500 మంది మరణించారు. ఆసుపత్రిలో పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని పాలస్తీనా అధికారులు ఆరోపించగా.. మిలిటెంట్ గ్రూప్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గాజా నుంచి మిస్ ఫైర్డ్ రాకెట్‌తో ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా, గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 12,000 మందికి పైగా గాయపడగా, 3,300 మందికి పైగా మరణాలు సంభవించాయి.

మరోవైపు, గాజాలోని ఆసుపత్రిపై దాడిపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాధానమిస్తూ.. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. "ఇజ్రాయెల్‌పై జరిగిన భయానక ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజం కలిసి నిలబడాలని మేము నమ్ముతున్నాము" అని బాగ్చీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+