చోటా రాజన్‌ను జైల్లోనే చంపేస్తాం: చోటా షకీల్
న్యూఢిల్లీ: చోటా షకీల్‌ను తీహార్ జైల్లోనే చంపుతామని మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ అన్నారు. శనివారం నాడు దావూద్ 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షకీల్ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం చాలా భక్తిపరుడయ్యాడని, అయితే ఇప్పుడే రిటైర్ అయ్యే ఆలోచనేమీ లేదని అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ వెల్లడించాడు.
దావూద్ పుట్టిన రోజు వేడుక ఎలా జరుపుకోవాలో వారి కుటుంబం నిర్ణయిస్తుందని చెప్పాడు.
దావూద్ పుట్టినరోజు వేడుకలు భారీగా జరుగుతాయని, మాఫియా సామ్రాజ్యానికి వారసుడిని ప్రకటిస్తారని మీడియాలో వచ్చిన కథనాలన్నీ బాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ వంటివేనని షకీల్ కొట్టిపారేశాడు.

‘దావూద్ భాయ్ స్థానంలోకి వేరెవరూ రారు. ఆయన రిటైర్ అవ్వరు. మమ్మల్ని ఆయనే నడిపిస్తారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు' అని షకీల్ స్పష్టం చేశాడు. దావూద్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, ఆయన దృష్టి అంతా వ్యాపారంపైనే ఉందని చెప్పాడు. తాము 99 శాతం వ్యాపారంపైనే దృష్టి నిలుపుతామని చెప్పాడు. తమ దారికి అడ్డొచ్చే వారిని తొలగించడానికి మిగిలిన ఒక్క శాతాన్ని కేటాయిస్తామన్నాడు.
చోటా రాజన్ చచ్చిన పాము అని, తీహార్ జైలులో తనను తాను కాపాడుకోవాలని చెప్పాడు. విదేశాలలో రాజన్‌ను చంపేందుకు తాము పలుమార్లు ప్రయత్నించిన మాట నిజమేనని అంగీకరించాడు.
ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా తామే రాజన్‌ను చంపుతామని చెప్పాడు. దావూద్ చాలా భక్తిపరుడయ్యాడని, ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్ చదువుతాడని, ప్రతి ఏడాది హజ్ వెళ్తున్నాడని తెలిపాడు. భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచన దావూద్‌కు లేదని షకీల్ పేర్కొన్నాడు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications