ద్రోహికి బుద్ధి చెప్తా, ముగింపు పలుకుతా: పన్నీరుపై శశికళ సంచలనం
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చేసిన విమర్శల పైన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు స్పందించారు. తాను 33 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని చెప్పారు.
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చేసిన విమర్శల పైన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు స్పందించారు. తాను 33 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని చెప్పారు.
పన్నీరు రె'ఢీ': నేటి వార్తలు మరిన్ని..

డిఎంకే హస్తం
ఎమ్మెల్యేలతో సమావేశం రహస్యంగా ఏమీ జరగలేదన్నారు. పార్టీని ఎవరూ చీల్చలేరని చెప్పారు. పార్టీ పునాదులను ఎవరూ కదపలేదని పరోక్షంగా పన్నీరు సెల్వంపైన ఘాటుగా స్పందించారు. ప్రస్తుత సంక్షోభం వెనుక డీఎంకే ఉందని ఆరోపించారు. ఒక్క రోజులోనే పన్నీరు సెల్వం ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.

జయలలిత, నేను ఎన్నో సంక్షోభాలు చూశాం
జయలలిత, తాను ఎన్నో సంక్షోభాలను చూశామని శశికళ వ్యాఖ్యానించారు,. ఈ సంక్షోభాన్ని కూడా తాను ధీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. అమ్మ చనిపోయిన తర్వాత బాధ్యతలు చేపట్టాలని తనను అందరూ కోరారని చెప్పారు.

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
తనకు 130 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు. అందరం అమ్మ బాటలో నడుద్దామన్నారు. ప్రస్తుత సంక్షోభం విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శశికళ కోరారు.

పన్నీరు సెల్వం మోసం చేశారు... నమ్మక ద్రోహి
గతంలో ఎన్నో తప్పులు చేసినా పన్నీరు సెల్వంకు అమ్మ జయలలిత అవకాశమిచ్చారని చెప్పారు. ఆయనకు పలు అవకాశాలను ఆమె ఇచ్చారన్నారు. జయ మృతి అనంతరం తాను కూడా అవకాశమిచ్చానని చెప్పారు. కానీ పన్నీరు సెల్వం మోసం చేశారని చెప్పారు. తాను సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని పన్నీరు సెల్వంకు కౌంటర్ ఇచ్చారు.
పన్నీరు సెల్వం చేసిన తప్పులకు ముగింపు పలకాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. పన్నీరు పెద్ద నమ్మక ద్రోహి అన్నారు.

నమ్మకద్రోహికి తగిన బుద్ధి చెబుతాం
జీవితకాలం అమ్మ ప్రతిపక్షంతో పోరాడారని, ఇప్పుడు అదే డీఎంకేతో పన్నీరు కలిశారన్నారు. నమ్మకద్రోహం చేసిన పన్నీరు సెల్వంకు తగిన బుద్ధి చెబుతామన్నారు. అమ్మ చనిపోయినప్పుడే తనను బాధ్యతలు తీసుకోమని చెప్పారని, కానీ విషాద సమయంలో సరికాదని ఊరుకున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications