ఆ రంగు లోదుస్తులు వేసుకురావాలి: అమ్మాయిలకు స్కూల్ మార్గదర్శకాలు
పుణే: మహారాష్ట్రలోని పుణేలో ఓ పాఠశాల అమ్మాయిల లోదుస్తులపై ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమైంది. బాలికల లోదుస్తుల రంగుపై ఆ విద్యాసంస్థ జారీ చేసిన ఉత్తర్వులు పెద్ద దుమారమే రేపింది.
ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన డైరీల్లో నియమ నిబంధనలు ఉన్నాయి. అందులో బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని ఉంది. ఆ పాఠశాల యాజమాన్యం ఈ ఆదేశాలను బలవంతంగా తమపై రుద్దుతోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారు పాఠశాల ఎదుట ఆందోళన చేసారు.

లోదుస్తులతో పాటు మరిన్ని అంశాలపై కూడా పలు సూచనలు చేసారు. రౌండ్ ముక్కుపుడక ధరించాలని, అది కూడా 0.3 సెంటీమీటర్లకు ఎక్కువగా ఉండవద్దని పేర్కొన్నారు. దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. బాలికల భద్రత కోసమే అని పేర్కొంది.












Click it and Unblock the Notifications