అలర్ట్ ప్రకటించిన అధికారులు, మరీ అంతగా ఉండకపోవచ్చు కాని ? జాగ్రత్త !
చెన్నై: రానున్న మూడు రోజుల పాటు చెన్నైతో పాటు ఆ నగర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. చెన్నై సిటీతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల చెన్నైలో కరుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నైరుతి బంగాళాఖాతంకు అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ మీదుగా ఎగువ సర్క్యూలేషన్ కారణంగా దాని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూన్ 21వ తేదీన బుధవారం చెన్నైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

అయితే గతకొన్ని రోజులుగా చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షం కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు సైతం జలమయం అయ్యాయి. అయితే బుధవారం చెన్నైలో మోస్తారు వర్షాలు పడేఅవకాశం ఉందని, భారీ వర్షాలు పడవని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. చెన్నై, పుదుచ్చేరితో పాటు దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ తమిళనాడులో జూన్ 22 నుంచి జూన్ 24వ తేదీ వరకు మూడు రోజులు పాలు మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం చెన్నైలోని పలు ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications