వెబ్ సిరీస్ నటి నూర్ మలాబిక్ దాస్ అనుమానాస్పద మృతి
ప్రముఖ వెబ్ సిరీస్ నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె వయస్సు 37 సంవత్సరాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని లోఖండ్‌వాలాలోని ఆమె నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో నటి మృతదేహం లభ్యమైంది. నూర్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నటి ఆత్మహత్యాయత్నం చేసి ఉంటే, అందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే నటి ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురైందా అనేది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.
ఫ్లాట్ తలుపులు పగులగొట్టి..
నూర్ మలాబికా దాస్ ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్లాట్ తలుపులు పగులగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా నటి మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఫ్లాట్ మొత్తం సోదా చేసి నూర్ మందులు, ఆమె మొబైల్ ఫోన్ మరియు డైరీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం లభ్యమైన స్థితిని బట్టీ ఆత్మహత్యగా భావిస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక వస్తే తప్ప నూర్ మృతిపై పూర్తి స్థాయిలో ఓ నిర్థారణకు వచ్చే అవకాశం లేదని, అంతవరకూ అనుమానాస్పద మృతిగా చూడనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలా వెబ్ సిరీస్‌లలో నూర్ నటించగా, 'ది ట్రయల్' అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందింది.













Click it and Unblock the Notifications