గాలి ఇంట పెళ్లి సందడి ఇలాగే ఉంటుంది (ఫోటోలు)

బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, లక్ష్మి అరుణల ఏకైక కుమార్తె బ్రహ్మిణి వివాహం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి వైభంగా జరగడంతో గాలి అభిమానులు, ఆయన అనుచరులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త విక్రమ్ దేవ్ రెడ్డి, రమాదేవిల కుమారుడు రాజీవ్ రెడ్డి గాలి బ్రహ్మిణిని వివాహం చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్లే గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహం రంగరంగ వైభవంగా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

చూడముచ్చట జంట

చూడముచ్చట జంట

రాజీవ్ రెడ్డి, గాలి బ్రహ్మిణి చూడముచ్చట జంట అని పెళ్లికి విచ్చేసిన పెద్దలు అన్నారు. నవవధూవరులను జీవితాంతం చల్లగా ఉండాలని ఆశిర్వదించారు. రాజీవ్ రెడ్డి, బ్రహ్మిణిలు ఎంతో వినయంగా అందరి దగ్గర ఆశిర్వాదం తీసుకున్నారు.

కలిసుందాం రా

కలిసుందాం రా

జీవితాంతం తాము కలిసేఉంటాం అంటు పెద్దల ముందు పురోహితులు చెప్పినట్లు హిందూ సాంప్రధాయం ప్రకారం రాజీవ్ రెడ్డి, బ్రహ్మిణిలు ఇలా కలశం ముందు ప్రతిజ్ఞచేశారు.

సంతోషంగా ఉంది

సంతోషంగా ఉంది

బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కుటుంబ సమ్మేతంగా గాలి జనార్దన్ రెడ్డి ఇంట జరిగిన శుభకార్యానికి హాజరైనారు. ఈయనతో పాటు బీజేపీ నాయకులు పెళ్లికి హాజరైనారు.

ఎలాగున్నాను చెప్పండి

ఎలాగున్నాను చెప్పండి

పెళ్లికి వచ్చిన వారిని గాలి జానార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి చిరునవ్వుతో అందరిని ఆకర్షించారు. ఎలాగున్నారు అంటూ ఆమె తన బంధువులు, స్నేహితులు, అతిథులను పలకరించారు.

రండి బాగున్నారా: గాలి జనార్దన్ రెడ్డి

రండి బాగున్నారా: గాలి జనార్దన్ రెడ్డి

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి విచ్చేసిన ప్రముఖులను కల్యాణ మండపం దగ్గరకు ఆయనే స్వయంగా తీసుకు వెళ్లారు. కన్నడ ప్రముఖ నటుడు యష్ తదితరులను ఇలా కల్యాణ మండపం దగ్గరకు తీసుకు వెళ్లారు.

అన్నమయ్య‘వెంకటేశ్వర స్వామి' వచ్చారు

అన్నమయ్య‘వెంకటేశ్వర స్వామి' వచ్చారు

అలనాటి ప్రముఖ హీరో, బహుబాష నటుడు సుమన్ తన కుటుంబ సభ్యులతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి ఇంట జరిగిన పెళ్లి వేడుకులకు హాజరైనారు. ఆయనతో పాటు ప్రముఖ హాస్యనటుడు, కామిడి కింగ్ బ్రంహ్మానందం, సాయికుమార్, ఆయన కుమారుడు ఆది తదితరులు గాలి కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి హాజరైనారు.

మాజీ మంత్రి శోభా కరందాజ్లే

మాజీ మంత్రి శోభా కరందాజ్లే

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే గాలి జనార్దన్ రెడ్డి ఇంట జరిగిన పెళ్లికి హాజరైనారు. బీజేపీ ఎంపీ శ్రీరాములు, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, శోభా కరందాజ్లే, రాజీవ్ రెడ్డి, బ్రహ్మిణి, గాలి లక్ష్మి అరుణ ఇలా ఫోటోకు ఫోజు ఇచ్చారు.

తెలుగింటి ఆడపడుచుతో బావ

తెలుగింటి ఆడపడుచుతో బావ

మన తెలుగింటి ఆడపడుచు, బహుబాష నటి సుమలత, ఆమె భర్త, మాజీ మంత్రి (కాంగ్రెస్), రెబల్ స్టార్ అంబరీష్ కుటుంబ సభ్యులతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరైనారు. రెబల్ స్టార్ అంబరీష్, సుమలతతో కలిసి కన్నడ నటుడు యష్ ఇలా పెళ్లిలో దర్శనం ఇచ్చారు.

యడ్యూరప్ప సందడి

యడ్యూరప్ప సందడి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బీఎస్. యడ్యూరప్ప గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరైనారు. ఆయన పెళ్లిలో అడుగు పెట్టగానే ఇలా సందడి మొదలైయ్యింది. గాలికి ఇచ్చిన మాట ప్రకారం యడ్యూరప్ప పెళ్లికి హాజరై వధూవరులను ఆశిర్వదించారు. వీరితో పాటు కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాల గాలి ఇంట పెళ్లికి హాజరైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+