వింత: సినిమాను తలపించేలా ఎంఏల్ఏ పెళ్ళి ఇన్విటేషన్,, వీడియో వైరలైందిలా...
మహరాష్ట్ర బిజెపి చీఫ్ రావ్ సాహెబ్ పాటిల్ ధన్వే తన కుమారుడు ఎంఏల్ ఏ సంతోష్ పాటిల్ వివాహన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెళ్ళి కంటే వివాహ ఆహ్వాన పత్రికనే వెరైటీగా ముద్రించి వార్తల్లో నిలిచారు.
ముంబై:పెళ్ళి వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా ముద్రించి మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్ రెడ్డి చరిత్ర సృష్టించారు.అయితే అదే తరహలో మహరాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తన కుమారుడి వివాహన్ని అంగరంగ వైభవంగా చేశారు. అంతేకాదు వివాహ ఆహ్వాన పత్రికను గాలి జనార్థన్ రెడ్డిని తలదన్నే రీతిలో రూపొందించారు. ఈ మేరకు ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహరాష్ట్ర బిజెపి చీఫ్ రావ్ సాహెబ్ పాటిల్ ధన్వే తన కుమారుడు బోకార్టన్ ఎంఏల్ఏ సంతోషా పాటిల్ వివాహన్ని గురువారం నాడు అంగరంగ వైభవంగా చేశాడు.

ఈ వివాహనికి అతిథులను ప్రత్యేకంగా తయారు చేయించిన ఆహ్వాన పత్రికలను ముద్రించి ఆహ్వానాలు పంపారు రావ్ సాహెచ్ పాటిల్ ధన్వే.ఈ వీడియో ఆహ్వనాలు ఈ పెళ్ళికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి తోడుగా మరికొన్ని ప్రత్యేకతలు కూడ ఈ పెళ్ళిలో చోటుచేసుకొన్నాయి.
డిజైనర్ సెట్లు, డ్రోన్ కెమెరాలు, పోలీస్ నిఘాలో నిర్వహించిన పెళ్ళితో రావ్ సాహెబ్ చరిత్ర సృష్టించారు. ఈ వివాహనికి ప్రత్యేకంగా రూపొందించిన పెళ్ళి ఆహ్వన పత్రిక ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది.
ఈ వీడియోను శుక్రవారం నాడు ఫేస్ బుక్ లో పెళ్ళి కొడుకు పోస్ట్ చేశాడు. సినిమాస్టయిల్ ను మించి రూపొందించాడు. పెళ్ళి కూతురితో పాటు పెళ్ళికొడుకు సైకిల్ ను తొక్కుతూ పార్క్ లో డ్యాన్స్ చేస్తూ ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకొంటుంది. సుమారు 45 వేలకు పైగా మంది ఈ వీడియోను లైక్ చేశారు., మందలాది మంది ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వివాహానికి సుమారు 30 వేల మంది అతిథులు హజరయ్యారు. ఈ పెళ్ళి వేడుకకు మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహ క్యాబినెట్ మంత్రులంతా హజరయ్యారు. సంతోష్ 2014 లో బోకార్టన్ నియోజకవర్గం నుండి ఎంఏల్ఏగా ఎన్నికయ్యారు. గత రెండేళ్ళుగా కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ నియోజకవర్గంలో భారీ ఖర్చుతో అత్యంత వైభవంగా పెళ్ళి వేడుకలు నిర్వహించడం వార్తల్లో నిలిచింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications